Home / జాతీయం
ఆఫీస్ లో వర్కింగ్ అవర్స్ పూర్తి అయినా.. పెండింగ్ లో ఉన్న పనుల వల్ల కానీ ఇతర కారణాలతో ఆఫీస్ లోనే ఉండిపోతాము. కొన్ని సార్లు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటే ఓవర్ టైం చేయాల్సి వస్తుంది.
ఉత్తరాఖండ్‌లోని మారుమూల ప్రదేశానికి డ్రోన్ విజయవంతంగా కీలకమైన ఔషధాలను తీసుకువెళ్లింది. గర్హ్వాల్ జిల్లాలోని టెహ్రీలోని ఆరోగ్య కేంద్రానికి క్షయవ్యాధి మందులను పంపిణీ చేసింది.
ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ బీబీసీ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు మూడో రోజూ కొనసాగుతున్నాయి. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ఢిల్లీ, ముంబై లోని సంస్థ కార్యాలయాల్లో సర్వే పేరుతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
Wipro: ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల కోతలు విధిన్నాయి. ఈ తరుణంలో విప్రో మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన వేరియబుల్ పే ను అందనుంది. మూడో క్వార్టర్ లో 87 శాతం వేరియబుల్ పే విడుదల చేస్తున్నట్టు విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉద్యోగులకు మెయిల్ […]
ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమం కింద ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను రప్పిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం తెలిపారు.
ఈశాన్యరాష్ట్రం త్రిపుర అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరగనుంది.
రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (RTDC) ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే దాని హోటళ్లలో బీర్ మరియు ఆల్కహాల్ అమ్మకాలను ప్రారంభించాలని అన్నారు.
Icc Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
కేరళ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై బంగారం కుంభకోణం నిందితురాలు స్వప్న సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళను అమ్మేందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Delhi Crime: దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటన జరిగింది. ప్రియురాలిని చంపేసి.. ఫ్రిజ్ లో దాచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న ప్రియురాలిని.. చంపేశాడు ప్రియుడు. ఇలా చేసిన కొన్ని గంటలకే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.