Home / జాతీయం
పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ కు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండటానికి నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్బంగా నేపాల్‌లోని పోఖారా నుండి బస్సు ఎక్కినప్పుడు ఆమె తన పేరు 'ప్రీతి'గా చెప్పినట్లు బయటపడింది.
వందే భారత్ రైలులో బాత్రూమ్ని ఉపయోగించినందుకు ఒక వ్యక్తి రూ.6,000 నష్టపోయాడు. దీనికి సంబంధించి వివరాలివి. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన భార్య, 8 ఏళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామం సింగ్రౌలీకి వెడుతున్నాడు
Manipur women: గత కొంతకాలంగా మణిపూర్ అట్టుడుకుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ రెండు తెగల అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపధ్యంలో రాయ్‌గఢ్ జిల్లాఇర్సల్వాడి గ్రామంలో కొండచరియలు విరిగిపడి పది మంది మరణించారు. ఈ శిధిలాల కింద 50 మంది దాకా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు 17 రోజులపాటు కొనసాగుతాయి. ఆ సమావేశాల్లో 31 బిల్లులను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.మణిపూర్ హింస, రైల్వే భద్రత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్-చైనా సరిహద్దు స్థితి మరియు రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత వంటి ఇతర అంశాలను వర్షాకాల సమావేశంలో లేవనెత్తడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీ చేసే చలానాలు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే ఢిల్లీ లోని 20,000 వాహనాలు ఒక్కొక్కటి 100కి పైగా చలాన్లను అందుకున్నాయి. అయితే వాటి యజమానులు ఇంకా జరిమానాలు చెల్లించడానికి పట్టించుకోలేదు.
మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్‌తో భేటీ అయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో పవన్‌తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.
దేశంలోని ప్రతిపక్షాలు తమ ఫ్రంట్ పేరుగా 'ఇండియా'ను ప్రకటించిన ఒక రోజు తర్వాత, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమికి ట్యాగ్‌లైన్‌గా 'జీతేగా భారత్'ను ఎంచుకున్నారు.గత రాత్రి జరిగిన చర్చల తర్వాత జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)పై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్యాగ్‌లైన్ అనేక ప్రాంతీయ భాషల్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో
ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ యునైటెడ్ విపక్ష ఫ్రంట్‌ని ఇకపై ఇలా పిలుస్తారు, బెంగళూరులో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న 26 పార్టీలు ఈ రోజు నిర్ణయం తీసుకున్నాయి, కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ 2024 సాధారణ ఎన్నికలను మోదీ వర్సెస్ ఇండియా యుద్ధంగా పిలిచారు.