Home / జాతీయం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం నాడు ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వాళ్లకే గ్యాంరటీ లేని వారు కొత్త కొత్త గ్యారంటీలతో పాటు కొత్త స్కీంలతో హామీలను ఇస్తున్నారని మోదీ అన్నారు.
ఇకనుంచి బీహార్ లో జరిగే ప్రతీ వివాహం పోలీసులకు ముందే తెలుస్తుంది. ప్రజలు తమ కుటుంబంలో జరిగే వివాహాలకు సంబంధించి సమాచారాన్ని స్దానిక పోలీసులకు తెలియజేయాలని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ సంజయ్ సింగ్ తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం తెలిపారు. అన్ని పార్టీల నుండి ఉత్పాదక చర్చలు జరగాలని ఆయన ట్విట్టర్లో కోరారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించిన కేసుల్లో సాక్ష్యాధారాలు మరియు సాక్షులకు ట్యూటర్ని అందించిన ఆరోపణలకు సంబంధించి వెంటనే లొంగిపోవాలని సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను గుజరాత్ హైకోర్టు శనివారం ఆదేశించింది.
మహిళలు సెక్స్ కు తమ అంగీకారాన్ని తెలిపే వయస్సును 18 నుండి 16 సంవత్సరాలకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడంటూ 20 ఏళ్ల యువకుడిపై దాఖలయిన ఎఫ్ఐాఆర్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రతీఏటా జరిగే అమర్నాథ్ వార్షిక యాత్ర శనివారం (జూలై 1) ప్రారంభమైంది. 62 రోజుల యాత్రను బల్తాల్ బేస్ క్యాంప్‌లో శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు సీనియర్ అధికారులతో పాటు డిప్యూటీ కమిషనర్ గందర్బల్ శ్యాంబీర్ జెండా ఊపి ప్రారంభించారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు విషాద ఘటన చోటు చేసుకుంది. బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణిస్తోన్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనం కాగా.. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా మారింది. బస్సు యావత్మాల్ నుంచి
మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా లేఖను శుక్రవారం పలువురు మహిళలు చించివేశారు.బీరెన్ సింగ్ రాజీనామా పత్రంలో పాటు 20 మంది ఎంఎల్ఏలను తీసుకుని గవర్నర్ నివాసానికి బయలు దేరారు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 100 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేశాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2022 మరియు జూన్ 2023 మధ్య కాలంలో, మొత్తం 2,140 ట్రిప్పుల్లో 25.20 లక్షల మంది ప్రయాణికులు ఈ సెమీ-హై స్పీడ్ రైళ్లలో ప్రయాణించినట్లు జూన్ 21 వరకు ఉన్న డేటా చూపుతోంది.
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన బ్లాక్ మరియు టేక్ డౌన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. కంపెనీ అభ్యర్ధనలో ఎలాంటి అర్హతలు లేవని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.