Last Updated:

Delhi Metro Stations: ఢిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్లానీ నినాదాల రాతలు

ఆదివారం నాడు ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్తానీ నినాదాల రాతలు కనిపించాయి.శివాజీ పార్క్, మాదిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, మహారాజా సూరజ్మల్ స్టేడియం, ప్రభుత్వ సర్వోద్య బాల్ విద్యాలయ నాంగ్లోయ్, పంజాబీ బాగ్ మరియు నంగ్లోయ్ మెట్రో స్టేషన్లలో వివాదాస్పద ప్రో ఖలిస్తానీ నినాదాలు కనిపించాయి.

Delhi Metro Stations: ఢిల్లీ మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్లానీ నినాదాల రాతలు

Delhi Metro Stations: ఆదివారం నాడు ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్తానీ నినాదాల రాతలు కనిపించాయి.శివాజీ పార్క్, మాదిపూర్, పశ్చిమ్ విహార్, ఉద్యోగ్ నగర్, మహారాజా సూరజ్మల్ స్టేడియం, ప్రభుత్వ సర్వోద్య బాల్ విద్యాలయ నాంగ్లోయ్, పంజాబీ బాగ్ మరియు నంగ్లోయ్ మెట్రో స్టేషన్లలో వివాదాస్పద ప్రో ఖలిస్తానీ నినాదాలు కనిపించాయి.

రాతల వెనుక ఎస్ఎఫ్ జె (Delhi Metro Stations)

ఢిల్లీ బనేగా ఖలిస్తాన్ మరియు ఖలిస్తాన్ రెఫరెండం జిందాబాద్ అనే సందేశాలు దేశ రాజధానిలోని కొన్ని భవనాల గోడలపై రాయబడ్డాయి. దీనిపై విచారణ జరుగుతోందని, ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.G20 సమ్మిట్‌కు ముందు, సిక్కులు ఫర్ జస్టిస్ ( ఎస్ఎఫ్ జె) ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు వ్రాయబడిన రా ఫుటేజీని విడుదల చేసింది. ఢిల్లీలోని శివాజీ పార్క్ నుంచి పంజాబీ బాగ్ వరకు పలు మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో ఎస్ఎఫ్ జె కార్యకర్తలు ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఉత్తర భారతదేశంలో వేర్పాటువాద ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతుగా నినాదాలతో గ్రాఫిటీలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.ఖలిస్తానీ వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రోత్సహించడంలో ఎస్ఎఫ్ జె చాలా కాలంగా నిమగ్నమై ఉంది.