Man Steals in Flights: 110 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణాలు.. లక్షలవిలువైన నగలు కొట్టేసిన ఘరానా దొంగ
దొంగలు మామూలు బస్సులు, రైలు ప్రయాణాల్లోనే కాదు... విమానాల్లో కూడా ఉంటారని తాజా సంఘటన రుజువు చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 200 సార్లు విమానాల్లో ప్రయాణించి ప్రయాణికుల ఖరీదైన వస్తువులు కొట్టేసేవాడు.
Man Steals in Flights: దొంగలు మామూలు బస్సులు, రైలు ప్రయాణాల్లోనే కాదు… విమానాల్లో కూడా ఉంటారని తాజా సంఘటన రుజువు చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 200 సార్లు విమానాల్లో ప్రయాణించి ప్రయాణికుల ఖరీదైన వస్తువులు కొట్టేసేవాడు. 40 ఏళ్ల రాజేష్‌కపూర్ అనే వ్యక్తి గత 110 రోజుల్లో విమానాల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల హ్యాండ్‌బ్యాగ్‌ల నుంచి విలువైన వస్తువులు దొంగిలిస్తూ సోమవారం నాడు పోలీసులకు పట్టుబడ్డాడు.
ఇక దొంగతనాల విషయానికి వస్తే ఆయన డొమెస్టిక్ ప్రీమియం విమానాల్లో ప్రయాణిస్తూ.. సహచరు ప్రయాణికుల బ్యాగ్‌ల నుంచి విలువైన వస్తువులను తస్కరించేవాడు. అయితే పోలీసుల కన్నుగప్పేందుకు చనిపోయిన తన తమ్ముడి గుర్తింపు కార్డును వినియోగించేవాడు. రాజేష్‌కపూర్‌ను అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు ఉషా రంగ్‌నాని కపూర్ దొంగతనాల గురించి వివరించారు. దొంగిలించిన నగలను పహార్‌గంజ్‌లో శరద్ జైన్ అనే వ్యక్తికి విక్రయించడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అప్రమత్తమై అతన్ని కరోల్‌బాగ్‌లో అరెస్టు చేసినట్లు ఆమె చెప్పారు. అయితే గత మూడు నెలల కాలంలో రెండు వేర్వేరు విమానాల్లో దొంగతనాలను జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఫేక్ నెంబరుతో టికెట్..(Man Steals in Flights)
గత నెల 11న ఓ ప్రయాణికుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రయాణంలో సుమారు రూ.7 లక్షల విలులైన నగలను కోల్పోయాడు. ఫిబ్రవరి 2న అమృతసర్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో రూ.20 లక్షల విలువచేసే నగలు ఇతర విలువైన వస్తువులను కోల్పోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీ, అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. అనుమానిత ప్యాసింజర్‌ల ఫోన్ నెంబర్లు సేకరించారు. అయితే కపూర్ టికెట్ బుక్‌చేసినప్పుడు ఫేక్ నంబరు ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు. తర్వాత టెక్నికల్ సర్వెలెన్స్ ప్రకారం కపూర్ ఒరిజినల్ నంబరును గుర్తించి తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ కమీషనర్ వివరించారు.
11 దొంగతనం కేసులు..
కాగా రాజేష్ కపూర్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. ఐదు దొంగతనాల కేసుల్లో తన పాత్ర ఉందని అంగీకరించాడు. దాంట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానంలో కూడా దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. కపూర్ మొత్తం 11 దొంగతనం కేసులో పాల్గొన్నాడు. అలాగే జూదం, నమ్మకద్రోహం కేసులు కూడా అతనిపై నమోదు చేశారు. ఇక కపూర్ విషయానికి వస్తే ప్రధానంగా ధనవంతులైన ప్రయాణికులు ముఖ్యంగా వయసుపైబడ్డవారిని… అంతర్జాతీయ ప్రయాణికులను టార్గెట్ చేస్తాడు. అందుకే ఆయన ప్రీమియం డిమెస్టిక్ విమానాల్లో ప్రయాణిస్తాడు. ప్రధానంగా ఎయిర్ ఇండియా, విస్తారా విమానాల్లో ప్రయాణించేవాడు. ఢిల్లీ, చండీఘడ్, హైదరాబాద్ డెస్టినేషన్‌కు వెళ్లే విమానాల్లో ఎక్కువ దొంగతనాలు చేశాడు.
ఇక రాజేష్‌కపూర్ దొంగతనం విషయానికి వస్తే బోర్డింగ్ సందర్భంగా విమానంలో రద్దీగా ఉంటుంది. ప్రయాణికులు హ్యాండ్‌బ్యాగ్‌ను సీటు పై ఉండే కేబిన్‌లో పెడుతుంటారు. ప్రయాణికుడు హ్యాండ్‌బ్యాగ్‌ను కేబిన్ పెట్టి సీటులో కూర్చున్న తర్వాత కపూర్ తాపీగా ప్రయాణికుడి హ్యాండ్‌బ్యాగ్‌లలో విలువైన వస్తువులు ఉన్నాయా అని చూసి అప్పుడే దొంగిలించి తన హ్యాండ్‌బ్యాగ్‌లోకి బదిలీ చేసి తర్వాత తన సీటులో కూర్చునే వాడు. పలుసందర్భాల్లో దొంగతనం చేయాలనుకున్న వ్యక్తి సీటు దగ్గరకు తన సీటుకూడా మార్చుకొనే వాడని పోలీసులు వివరించారు.