Last Updated:

Dress Code: డాక్టర్లకు డ్రెస్ కోడ్.. హాస్పిటల్ కు మేకప్, జీన్స్ లతో వస్తే కుదరదు

హాస్పిటల్ సిబ్బంది కోసం నూతన డ్రెస్ కోడ్ ను తీసుకొచ్చింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బంది ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన డ్రెస్ కోడ్ ను ఫాలో అవ్వాలి.

Dress Code: డాక్టర్లకు డ్రెస్ కోడ్.. హాస్పిటల్ కు మేకప్, జీన్స్ లతో వస్తే కుదరదు

Dress Code: హాస్పిటల్ సిబ్బంది కోసం నూతన డ్రెస్ కోడ్ ను తీసుకొచ్చింది హర్యానా ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే సిబ్బంది ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన డ్రెస్ కోడ్ ను ఫాలో అవ్వాలి. ఈ డ్రెస్ కోడ్ నిర్ణయం పేషెంట్లకు, డాక్టర్లకు మధ్య తేడా తెలుసుకునేందుకు వీలు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డ్రెస్ కోడ్ ప్రకారం.. హాస్పిటల్ సిబ్బంది ఇకపై ఎక్కువ నగలు, డెనిమ్ జీన్స్, పలాజో ప్యాంట్లు, బ్యాక్ లెస్ టాప్స్, స్కర్టులు లు వేసుకోరాదు. మహిళా డాక్టర్లు మేకప్, వెరైటీ హెయిర్ స్టయిల్స్ కు దూరంగా ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ డ్రెస్ లకు నో ఎంట్రీ(Dress Code)

అదే విధంగా మగ వాళ్లకు కూడా కొన్ని రూల్స్ పెట్టింది. మోడ్రన్ హెయిర్ కట్, విచిత్ర స్టయిల్స్, టీషర్టులు, జీన్స్ లు, లెదర్ ప్యాంట్లు, నడుము వరకు ఉండే టాప్ లు, స్నీకర్స్ , స్లిప్పర్స్ కూడా ధరించకూడదు. ప్రతి ఒక్క సిబ్బంది తమ గోళ్లను పొడవుగా పెంచకూడదు.

ప్రొఫెషనల్ గా కనిపించే ఫార్మల్ దుస్తులనే ధరించాలి. నర్సింగ్ క్యాడర్ కు సంబంధించిన ట్రైనీలు నల్ల ప్యాంట్, వైట్ షర్ట్ తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ , ఈక్వాలిటీ, సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డ్రెస్ కోడ్ తీసుకొచ్చినట్టు హర్యాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు.

ఈ రూల్స్ తప్పక పాటించాలి: ఆరోగ్య మంత్రి

ఈ నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని మంత్రి వెల్లడించారు. నైట్ షిప్టులు, వీకెండ్స్ లో కూడా డ్రెస్ కోడ్ కు మినహాయింపు ఉండదు. ఒక వేళ ఈ నియమాలు పాటించక పోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

డ్రెస్ కోడ్ పాటించని సిబ్బందిని ఆరోజు గైర్హాజరుగా పరిగణిస్తామన్నారు. హాస్పిటల్ సిబ్బంది కూడా పేరు ఉండే ట్యాగ్ ను ధరించాలన్నారు. ఈ కోడ్ సెక్యూరిటీ, డ్రైవర్లు, శానిటైజ్ సిబ్బంది, కిచెన్ వర్కర్స్ కూడా వర్తించనుంది.