Air India flight: మస్కట్-కోచి ఎయిర్ ఇండియా విమానం ఇంజన్ లో మంటలు
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలంటుకోవడంతో విమానం నుంచి ప్రయాణికులను కిందికి దించేశారు. మస్కట్ నుంచి కోచికి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సందర్భంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
Muscat: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలంటుకోవడంతో విమానం నుంచి ప్రయాణికులను కిందికి దించేశారు. మస్కట్ నుంచి కోచికి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సందర్భంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో పాటు మొత్తం 145 మంది ప్రయాణికులున్నారు. వారిలో నలుగురు పసిపిల్లలున్నారు. వారందరిని విమానం నుంచి దించేసి సురక్షింతగా టెర్మనల్ బిల్డింగ్‌కు తరలించారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని డీజీసీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది. వెంటనే మరో విమానంలో ప్రయాణికులను కోచి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను ఇటీవలే ప్రభుత్వం నుంచి టాటాగ్రూపు టేకోవర్ చేసింది. ఇంటర్నేషనల్ బడ్జెట్ ఎయిర్‌లైన్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రధానంగా మధ్య ప్రాచ్య దేశాలకు విమాన సర్వీసులు నడపుతోంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ, మధ్య ఆసియా దేశాలకు విమాన సర్వీసులు నడుపుతుంటోంది.
రెండు నెలల క్రితం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కాలికట్ నుంచి దుబాయి వెళ్లాల్సిన విమానంలో మంటలు చేలరేగినట్లు వాసన రావడంతో వెంటనే విమానాన్ని మస్కట్‌కు తరలించారు. అప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు.