Last Updated:

paramilitary jobs: గత ఐదేళ్లలో 50,000 మంది పారామిలటరీ ఉద్యోగాలను వదిలేసారు..

గత ఐదేళ్లలో దేశంలోని ఆరు పారామిలటరీ బలగాలకు చెందిన కనీసం 50,155 మంది సిబ్బంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. మార్చి 17న రాజ్యసభలో సమర్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది.

paramilitary jobs: గత ఐదేళ్లలో 50,000 మంది పారామిలటరీ ఉద్యోగాలను వదిలేసారు..

paramilitary jobs: గత ఐదేళ్లలో దేశంలోని ఆరు పారామిలటరీ బలగాలకు చెందిన కనీసం 50,155 మంది సిబ్బంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. మార్చి 17న రాజ్యసభలో సమర్పించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది.

BSF లోనే ఎక్కువగా..(paramilitary jobs)

కేంద్ర హోం శాఖ నుండి వివరాలను కోరిన పార్లమెంటరీ కమిటీ, తన నివేదికలో, అటువంటి పరిస్దితి దళాలలో పని పరిస్థితులను ప్రభావితం చేస్తుందని, కాబట్టి పని పరిస్థితులను గణనీయంగా మెరుగుపరచడానికి మరియు సిబ్బందిని కొనసాగించడానికి ప్రేరేపించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అస్సాం రైఫిల్స్ మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) విషయంలో సిబ్బంది వైదొలగడం గణనీయంగా పెరిగింని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమర్పించిన డేటా చూపించింది, సరిహద్దు భద్రతా దళం ( BSF)విషయంలో కూడా అదే విధంగా ఉంది .సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరియు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సశస్త్ర సీమా బల్ (SSB) విషయంలో మునుపటి సంవత్సరం గణాంకాల కంటే ఇది తక్కువగా ఉంది.ఉద్యోగాలను విడిచిపెట్టిన వారిలో అత్యధికంగా BSF (23,553), తరువాత CRPF (13,640) మరియు CISF (5,876) ఉన్నారు.

సిబ్బందితో మాట్లాడాలి..

సిబ్బంది తమ ఉద్యోగాలను ఎందుకు వదులుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి సర్వేలు నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. స్వచ్ఛంద పదవీ విరమణ మరియు రాజీనామాను ఎంచుకునే సిబ్బందితో మంత్రిత్వ శాఖ నిష్క్రమణ ఇంటర్వ్యూలు లేదా సర్వేలు నిర్వహించాలి. వీటికి దారితీసే కారణాలను అంచనా వేయాలి. సిబ్బంది యొక్క ఆందోళనలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. వీటితో సిబ్బంది వైదొలగడాన్ని తగ్గించవచ్చని చెప్పింది.

పెరుగుతున్న ఆత్మహత్యలు..

మరోపక్క కేంద్ర సాయుధ పారామిలటరీ దళాలు కూడా 2018 మరియు 2022 మధ్య 654 ఆత్మహత్యలను నివేదించాయి. CRPF (230 మరణాలు) తరువాత BSF (174 మరణాలు)లో ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. అస్సాం రైఫిల్స్‌లో 43 మంది మరణించారు.మావోయిస్టులను ఎదుర్కోవడానికి బలగాలను నియమించిన ఛత్తీస్‌గఢ్‌లో అత్యధిక ఆత్మహత్యలు నమోదయ్యాయని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు తెలిపారు. గత నెలలో రెండు ఆత్మహత్యలు జరిగాయి.ఆత్మహత్యలు మరియు సిబ్బంది తమలోనే ఇతరును చంపడం నివారించడానికి టాస్క్ ఫోర్స్ పరిష్కార చర్యలను కూడా సూచిస్తుంది. దీనిపై టాస్క్‌ఫోర్స్ నివేదిక తయారు చేయబడుతోందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మార్చి 15 న చెప్పారు.