Home / తప్పక చదవాలి
రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంత కాలంగా రాజన్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్‌తో కలిసి వెంట నడిచారు.
వచ్చే శనివారంతో లోకసభ ఎన్నికలు ముగియబోతున్నాయి. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు అమెరికా వెళ్లి దాదాపు పది రోజుల పాటు అక్కడే ఉన్నారు.
ఏపీలోని బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈతకు దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యలంక వచ్చిన వీరు మధ్యల నల్లమడ వాగులో ఈతకు దిగినపుడు ఈ దుర్ఘటన జరిగింది.
హత్యాయత్నం కేసులో టిటిడి డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మీని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలక్ష్మీతోపాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసి కెమెరా ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగ, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు.
గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న కాల్పులు, వైమానిక దాడులతో 37 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వారిలో ఎక్కువ మంది గుడారాలలో ఆశ్రయం పొందారు, రఫా యొక్క పశ్చిమ టెల్ అల్-సుల్తాన్ జిల్లాలో సోమవారం, మంగళవారం జరిగిన కాల్పుల్లో 16 మంది మరణించారని పాలస్తీనా సివిల్ డిఫెన్స్ మరియు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు.. నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు
అంతర్రాష్ట్ర పిల్లల అక్రమరవాణా ముఠా గుట్టును హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీసులు రట్టు చేసారు. . ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ చెప్తోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.