Home / తప్పక చదవాలి
రోజు రోజుకూ సైబర్ నేరగాళ్ళు ఆగడాలు మీతిమీరి పోతున్నాయి. పోలీసు శాఖ, బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా.. ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించాలనుకున్న ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ -షార్ లోని ప్రైవేట్ లాంచింగ్ వేదిక నుంచి మంగళవారం ఉదయం ఈ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కి జిల్లా కోర్టు ఎట్టికేలకు బెయిల్ మంజూరు చేసింది. కోర్ట్ కొన్ని షరతులు విధించింది. పోలీస్ విచారణకు సతీష్ సహకరించాలని ఆదేశించింది.
మన దేశంలో సినిమా నటులకు ఉన్న కేజ్రీ అంతా ఇంతా కాదు. వారి ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మతి పోవాల్సిందే. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నివసిస్తున్న ఇళ్లు మన్నత్ ముందు అభిమానులు నుంచుని ఫోటోలు తీసుకొని వెళుతుంటారు.
పాకిస్తాన్లో గంటల కొద్దీ విద్యుత్ కోతలతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. విద్యుత్ కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మంగళవారం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రాంరహీం సింగ్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టులో మంగళవారం భారీ ఊరట లభించింది. డేరా మేనేజర్ రంజీత్‌సింగ్ హత్యలో కోర్టు డేరా చీఫ్‌తో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది.
: ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం తక్షణమే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. కాగా పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు బదిలీ చేశారు.
ఈ మధ్య విహార యాత్రలు విషాదంగా మారడం జరుగుతూవున్నాయి .అట విడుపు కోసం నదులు,సముద్రాలూ,జలపాతాలలో స్నానానికి వెళ్లి మృత్య వడిలోకి జారుకుంటున్నారు .తాజాగా విజయ నగరం జిల్లా జామి మండలం జాగారం వాటర్ ఫాల్స్ వద్ద ముగ్గురు యువకులు వాటర్ ఫాల్స్ లో పడి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది .
విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ విమానం ఎయిర్ బస్ 340 వచ్చింది.ఏపీ హజ్ యాత్రికులను తీసుకువెళ్లేందుకు ఆ విమానం వచ్చింది . ఈ భారీ విమానానికి వాటర్ కానన్ తో ఎయిర్పోర్ట్ అధికారులు ఘన స్వాగతం పలికారు.