Home / తప్పక చదవాలి
కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న గురువారం అర్ధరాత్రి జర్మనీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు అరెస్టు చేశారు. వెంటనే ప్రజ్వల్‌ను సీఐడి కార్యాలయానికి తరలించి విచారణ మొదలుపెట్టారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటన్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ఇవాళ్టితో ముగియనుంది.. సాయంత్రంతో ఆయన రిటైర్డ్ కాబోతున్నారు.
కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీ బాయి (94) గురువారం ఉదయం కన్ను మూశారు. శివశంకర్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు 1979 ఉప ఎన్నికల్లో ,1980 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు .
గత ఏడాది అక్టోబర్ 7 తెల్లవారుఝామున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడులకు తెగబడి సుమారు 1,200 మంది చంపి ... 250 మంది ఇజ్రాయెల్ పౌరులను తమ వెంట తీసుకువెళ్లారు. అటు నుంచి ఇజ్రాయెల్ గాజాపై ప్రతీకారదాడులకు పాల్పడుతోంది
ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోని చురు, హర్యానాలోని సిర్సాలో పగటి ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతను మించిపోయాయి. సరాసరి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటింది.
పోలింగ్‌కు ఒక్క రోజు ముందు అంటే శనివారం నాడు చివరి విడత లోకసభ పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఇటు సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా ఒక శాతం వరకు క్షీణించాయి.
ఇటీవల పూనేలో ఓ సంపన్న కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు మద్యం మత్తులో తన ఖరీదైన పోర్ష్ కారుతో మోటార్ సైకిల్‌పై వెళ్తున్నఓ జంటను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారకుడయ్యాడు. అప్పటి నుంచి ఈ అంశం కాస్తా జాతీయ పతాక శీర్షికను ఆకర్షిస్తోంది. ఈ రోడ్డు ప్రమాదం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది.
కర్ణాటక హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఈ నెల 31న అంటే శుక్రవారం జర్మనీ నుంచి బెంగళూరు చేరుకోనున్నారు. దీనికి సంబంధించి ఆయన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే శుక్రవారం నాడు ఆయన బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయనను అరెస్టు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర్ బుధవారం నాడు చెప్పారు.
ఒడిషా ముఖ్యమంత్రి బిజూ జనతాదళ్ (బీజేడీ) సుప్రీమో నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకరోజు ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి.