Home / తప్పక చదవాలి
సిరియాలోని మిలిటరీ అకాడమీపై గురువారం జరిగిన డ్రోన్ల దాడిలో సుమారుగా 100 మందికి పైగా మరణించారు. సిరియా రక్షణ మంత్రి గ్రాడ్యుయేషన్ వేడుక నుండి బయలుదేరిన కొన్నినిమిషాల తర్వాత ఆయుధాలతో కూడిన డ్రోన్లు బాంబుదాడికి దిగాయని అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా చేసిన రాకెట్ దాడిలో 49 మంది మరణించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది
బంగ్లాదేశ్‌లో డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కేసులు నమోదవగా ఈ ఏడాది జనవరి నుండి కనీసం 1,017 మంది మరణించారు.ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారిలో 100 మందికి పైగా చిన్నారులు కూడా ఉన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులు క్యూ కడుతున్నారు.
: ఫ్రాన్స్ .. పర్యాటకులకు మరియు ప్రేమ పక్షులకు ప్రసిద్ధి చెందిన దేశం... ఇపుడు మనుషుల రక్తాన్ని తాగే బెడ్‌బగ్స్ ను తొలగించడానికి కష్టపడుతోంది. ఇవి గత కొన్ని వారాలుగా వీటిని ప్రజలు వీటిని బట్టలు, బ్యాక్‌ప్యాక్‌లు లేదా డైనింగ్ టేబుల్‌పై - సబ్‌వేలు, సినిమా ధియేటర్స్ వద్ద చూస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పాలనా యంత్రాంగం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి బుల్డోజర్ నమూనా న్యాయాన్ని అమలు చేసింది12 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో అధికారులు కూల్చేసారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని కారణంగా వారు పేర్కొన్నారు.
క్రికెటర్ శిఖర్ ధావన్‌ను విడిచిపెట్టిన భార్య ఏషా ధావన్ క్రూరత్వం ప్రదర్శించిందనే కారణంతో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం అతనికి విడాకులు మంజూరు చేసింది. ధావన్ మరియు ఏషా ముఖర్జీ 2012లో వివాహం చేసుకున్నారు.
హీరో విశాల్ నుంచి 7 లక్షలు లంచం తీసుకున్నందుకు గాను గుర్తుతెలియని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సిబిఎఫ్‌సి ) ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.ముగ్గురు నిందితులను మెర్లిన్ మేనగా, జీజా రాందాస్, రాజన్ ఎంలుగా గుర్తించగా, మిగతా వారి పేర్లు వెల్లడించలేదు.
కడప కోఆపరేటివ్ కాలనీలో దారుణం జరిగింది. భార్య పిల్లల్ని గన్ తో షూట్ చేసిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తర్వాత ఆత్మ హత్య చేసుకున్నాడు. ఇద్దరి భార్యల మధ్య ఆస్తి గొడవలు జరుగుతుండటంతో మొదటి భ్యార్యను హత్య చేసి తాను ఆత్మ హత్య చేసుకున్నాడు.
తెలంగాణ ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించారు. పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్‌ని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపిక చేశారు.
హైదరాబాదులో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. నగరంలోని కూకట్ పల్లితో పాటు.. శివారు ప్రాంతాల్లోని వారి ఇళ్లపైనా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు వంద టీములతో ఐటీ రైడ్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.