Home / తప్పక చదవాలి
2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్‌లకు అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది.
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో 48 గంటల్లో 31 మరణాలు సంభవించడం దేశంలో పెద్ద దుమారమే రేపుతోంది. అపరిశుభ్రతతో నిండిన ఆసుపత్రిలోని టాయ్‌లెట్‌ను అక్కడి డీన్ చేత కడిగించారు. అధికార శివసేన ఎంపీ. శివసేన ఎంపీ ఆదేశించడంతో డీన్ టాయిలెట్ కగడక తప్పలేదు
ఇండియాలోని కెనడా రాయబార కార్యాలయంలో ఉన్న 40 మంది రాయబారులను ఈ నెల 10 వ తేదీలోగా దేశం విడిచిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఫైనాన్షియల్ టైమ్స్ మంగళవారం నాడు ఓ వార్తను ప్రచురించింది. అయితే తాజా పరిణామలపై భారత ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటనల విడుదల చేయాల్సి ఉంది.
యూకేలో జాత్యహంకారానికి అర్దంపట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నర్సులు సిక్కు రోగి యొక్క గడ్డాన్ని ప్లాస్టిక్ గ్లోవ్స్‌తో కట్టి, అతని మూత్రంలో అతడినివదిలి, మతపరమైన కారణాల వల్ల తినలేని ఆహారాన్ని అతనికి అందించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి తన మరణశయ్యపై ఉన్న నోట్లో వివక్ష గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ నర్సులను కొనసాగించారు.
గత వారం రోజుల్లో బ్రెజిల్ లోని అమెజాన్ లో 100 కు పైగా డాల్ఫిన్లు మృతిచెందాయి. తీవ్రమైన కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంతంలో నీటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మరిన్ని త్వరలో చనిపోతాయని నిపుణులు అంటున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య పెరగుతుండగానే శంభాజీనగర్‌లోని ఘాటీ ఆసుపత్రిలో 24 గంటల్లో ఇద్దరు నవజాత శిశువులు సహా పది మంది రోగులు మరణించారు. దీనిపై శివసేన (UBT) నాయకుడు ఆదిత్య థాకరే X లో ఇలా వ్రాశారు
మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ మంత్రి కెటిఆర్ వరుస ప్రశ్నలు సంధించారు. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి సార్ అని కెటిఆర్ ప్రశ్నించారు. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం, పోసేదెప్పుడు.. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు.? మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడని నిలదీశారు.
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగులు మరణించడంతో మరణాల సంఖ్య 31కి చేరుకుంది. వీరిలో నలుగురు శిశువులు ఉన్నారు. మొత్తంమీద ఈ ఆసుపత్రిలో 24 గంటల్లో 16 మంది శిశువులు, 15 పెద్దలు మృతి చెందారు.
ఉదయపూర్- జైపూర్ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల వెంబడి ఇటుక సైజులో ఉన్న రాళ్లను గమనించిన లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రాళ్లు అమర్చి ఉన్న చోటుకు ముందే రైలు ఆగింది. రైల్వే సిబ్బంది ఈ రాళ్లను తొలగిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు తెలంగాణలోని నిజామాబాద్ లో పర్యటించనున్నారు. నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని మోదీ ఆదివారం మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం.