Home / తప్పక చదవాలి
పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌ను వణికించిన భూకంపం మృతుల సంఖ్య 2,400 కు పైగా దాటిందని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ తెలిపారు. ఈ భూకంపం కారణంగా సుమారుగా 2,445 మంది మరణించారని, 1,320 ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. హెరాత్‌లోని జిందా జన్ జిల్లాలోని 13 గ్రామాలలో భూకంప బాధితులు ఎక్కువగా ఉన్నారని సైక్ తెలిపా
ఎయిర్ ఇండియా ప్రయాణికులు మరియు దాని సిబ్బంది సభ్యుల భద్రత దృష్ట్యా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు బయలుదేరే, అక్కడనుంచి వచ్చే విమానాలను నిలిపివేసినట్లు ఆదివారం ప్రకటించింది. ఈ సమయంలో ఏదైనా విమానంలో బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు సహాయపడతామని ఎయిర్ ఇండియా తెలిపింది
పేమెంట్ గేట్‌వే సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అకౌంట్‌ను హ్యాక్ చేసి కొందరు వ్యక్తులు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 16,180 కోట్ల విలువైన నిధులను కొంత కాలంగా స్వాహా చేసినట్లు మహారాష్ట్రలోని థానే పోలీసులు తెలిపారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 మరియు ఈ సంవత్సరం మార్చి 31 మధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ. 3,000 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉందని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు.
సాధారణంగా పాలకులు ప్రజలకు ఉపయోగపడే, వారి జీవితాలను మెరుగుపరిచే నిర్ణయాలను తీసుకున్నపుడు ప్రజలు వారిపై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటారు. వీటిలో భాగంగా ఫోటోలకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, పూజలు చేయడం పరిపాటి. అయితే విశాఖ మహిళలు మాత్రం దీనికి భిన్నంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లిక్కర్ తో అభిషేకం చేసి తమ నిరసన చాటారు.
వరదల బారిన పడిన సిక్కిం రాష్ట్రంలో మృతుల సంఖ్య 77 కు చేరినట్లు అధికారులు ధృవీకరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సిక్కింలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటివరకు మొత్తం 29 మృతదేహాలను వెలికితీసినట్లు రాష్ట్ర సహాయ కమిషనర్ అనిల్‌రాజ్ రాయ్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 22 వ తేదీన ఆయన నరసాపురానికి చెందిన పుష్పవల్లిని పెళ్లాడబోతున్నారు. రాధాకృష్ణకు సెప్టెంబర్ 3న నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణి ల కుమార్తె పుష్పవల్లితో నిశ్చితార్దం జరిగిన విషయం తెలిసిందే.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గానికి రావాల్సిన అవకాశం లేకుండా పోతుందన్నారు. కేశవనగర్ గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజయ్య.
తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. పాదయాత్రలతో ముందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు ఇక బస్సుయాత్రలను కొనసాగించాలని నిర్ణయించారు.
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్దంలో రెండింటిలోనూ సుమారు 500 మందికి పైగా మరణించారు. తాజా నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా 300 మందికి పైగా మరణించారు.