Home / తప్పక చదవాలి
హమాస్‌పై యుద్ధం ప్రారంభమైన తరువాత మొదటిసారిగా, ఇజ్రాయెల్ నాలుగు రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించింది.కాల్పుల విరమణకు బదులుగా బందీలను విడుదల చేయడంపై కుదిరిందని తెలుస్తోంది. బందీల ఒప్పందంపై చర్చల మధ్యవర్తిత్వంలో ఖతార్ ప్రముఖ పాత్ర పోషించింది.
కెనడా పౌరులకు భారత్ ఈ-వీసా సేవలను పునరుద్ధరించిందని బుధవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్ల పేరును ముడిపెట్టారని పీఎం జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్లోకెనడియన్ పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది.
:నేడు పవన్ కళ్యాణ్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభలో సేనాని పాల్గొననున్నారు. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన అధినేత ప్రచారం నిర్వహించనున్నారు. వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు మద్దతుగా సభ ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేసింది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది.
ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తుల అటాచ్‌కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. మొత్తం 114 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి లభించింది. టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు గతంలో సీఐడీ పిటిషన్ వేసింది. సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు ఇస్తూ ఆస్తుల అటాచ్ కు అనుమతిచ్చింది. ఈ కేసులో నిందితులంతా చంద్రబాబు సహచరులని సీఐడీ చెబుతోంది.
:జపాన్ విస్కీ ఈ ఏడాది 100 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. జపాన్ లో 1923లో యమజాకిలో మార్కెట్ లీడర్ సుంటోరీ యొక్క మొట్టమొదటి డిస్టిలరీ స్దాపించబడింది. ఇపుడు జపాన్ లో 100 కంటే ఎక్కువ డిస్టిలరీలు ఉన్నాయి. పదేళ్లకిందటితో పోల్చితే ఇవి రెండు రెట్లు ఎక్కువ.
రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ సందర్భంగా రాత్రి జరిగిన తొక్కిసలాటలో 37 మంది యువకులు మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.గత వారం సైన్యం 18 మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,500 మందిని రిక్రూట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇటలీ ట్రిబ్యునల్ సోమవారం మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమూహాలలో ఒకటైన ఇటలీలోని ndrangheta లో సభ్యత్వం కలిగిన 207 మందిని దోషులుగా నిర్ధారించి వారికి 2,100 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ఈ కేసుకు సంబంధించి మరో 131 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి కఠినవ్యాఖ్యలు చేసింది రైతులను విలన్లుగా చేసి తమ మాట వినడం లేదని చెప్పింది. పంట వ్యర్దాలను తొలగించడాన్ని పంజాబ్ ప్రభుత్వం 100 శాతం ఉచితంగా ఎందుకు చేయడం లేదని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
9,000 కోట్ల మేరకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)ను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బైజూకి షోకాజ్ నోటీసు పంపింది. బైజూస్ మరియు థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బైజు రవీందరన్‌కు నోటీసు పంపబడింది.