Last Updated:

Ram Charan: RC16 షూటింగ్‌ సెట్‌లో సందడి చేసిన క్లింకార – పోటో షేర్‌ చేసిన రామ్‌ చరణ్‌

Ram Charan: RC16 షూటింగ్‌ సెట్‌లో సందడి చేసిన క్లింకార – పోటో షేర్‌ చేసిన రామ్‌ చరణ్‌

Ram Charan Daughter Klin Kaara in RC16: గ్లోబల్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం RC16 చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ని స్టార్ట్‌ చేసింది. తాజాగా RC16 సెట్‌లో అనుకోని బుల్లి అతిథి వచ్చి అందరిని సర్‌ప్రైజ్‌ చేశారు. తను ఎవరో కాదో మెగాస్టార్‌ చిరంజీవి ముద్దుల మనవరాలు, రామ్‌ చరణ్‌-ఉపాసనల గారాల పట్టి క్లింకార కొణిదెల. తాజాగా తన మూవీ సెట్‌లో కూతురితో చరణ్ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని షేర్‌ చేస్తూ తెగ మురిసిపోయాడు.

దీనికి ‘మై లిటిల్‌ గెస్ట్‌ ఆన్‌ సెట్’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక క్లింకారు ఇలా RC16లో చూసి మెగా అభిమానులంతా మురిసిపోతున్నారు. అయితే ఈ ఫోటోని షేర్‌ చేస్తూ చరణ్‌ కామెంట్‌ సెక్షన్‌ని డిసేబుల్ చేయడం గమనార్హం. కాగా క్లింకార పుట్టి ఏడాదిన్నర అవుతోంది. ఇంతవరకు ఈ మెగా వారసురాలని అభిమానులకు చూపించలేదు. తన విషయంలో చరణ్‌, ఉపాసనలు ప్రైవసీ మెయింటైన్‌ చేస్తున్నాయి.

తనని చూపించకుండానే క్లింకారతో కలిసి సందడి చేస్తున్న ఫోటోలను షేర్‌ చేస్తుండటంతో అభిమానుల్లో ఆమెను చూడాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇటీవల ఓ టాక్‌ షోలో పాల్గొన్న చరణ్‌కి క్లింకారను ఎప్పుడు చూపిస్తారనే ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. తను ఎప్పుడు తనని నాన్న అని పిలుస్తుందో అప్పుడే అందరికి చూపిస్తానని చెప్పుకొచ్చాడు. ఇదే షోలో క్లింకారతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకున్నాడు. రోజు ఉదయం తనతో రెండు గంటలు స్పెండ్‌ చేస్తానన్నాడు. అలాగే తనకు అన్నం కూడా తానే తినిపిస్తానని, తను తినేంతవరకు గార్డెన్‌ తిప్పుతూ ఉంటానంటూ కూతురి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు.