Home / తప్పక చదవాలి
యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం తన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ను తొలగించారు. సునక్ ఈరోజు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు.మాజీ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ యూకే కొత్త హోం మంత్రిగా ,మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ కొత్త విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు అంటూ 10 డౌనింగ్ స్ట్రీట్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
కుండపోత వర్షాల ఫలితంగా తలెత్తిన వరదలతో సోమాలియా, కెన్యాలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబరు నుండి వరదలతో సుమారుగా 50 లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1.2 మిలియన్ల మందికి పైగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అవగా దక్షిణ సోమాలియాలోని గెడో ప్రాంతంలో పౌర, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం కలిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో నిషేధం ఉన్నప్పటికీ దీపావళి రాత్రి ప్రజలు బాణసంచా కాల్చడంతో అది భారీ కాలుష్యానికి దారితీసింది. సోమవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది.ఢిల్లీలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన దృశ్యాల్లో దట్టమైన పొగమంచు వీధులను చుట్టుముట్టడం, దృష్టిని తీవ్రంగా పరిమితం చేయడం కనిపించింది.
హైదరాబాద్‌లోని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు.గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రదీప్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్ మంత్రికి దగ్గరి బంధువు. సబితా ఇంద్రారెడ్డి ఇతర బంధువుల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్దాం..24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సవాల్ చేసారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరెంట్ విషయమై బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు.
రత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మైనారిటీ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉత్సవాలను వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన జగన్ ప్రసంగిస్తూ.. ఎప్పటిలానే ప్రతి మాటకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, అంటూ తమని మోసం చేసాడని ముస్లిం వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయ సాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్‌పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి దర్యాప్తు సంస్థ సీఐడీకి అందించాలని డిమాండ్ చేశారు.
:కెనడా గడ్డపై ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తన ఆరోపణను పునరుద్ఘాటించారు తమ దేశం ఎల్లప్పుడూ చట్టబద్ధమైన పాలన కోసం నిలబడుతుందని అన్నారు.
గాజా ఆసుపత్రిలో సుమారు 1,000 మంది వ్యక్తులను మరియు రోగులను బందీలుగా ఉంచి, వారిని తప్పించుకోవడానికి అనుమతించని ఒక సీనియర్ హమాస్ కమాండర్‌ను వైమానిక దాడిలో చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
దీపోత్సవం యొక్క ఏడవ వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఒకే చోట ఒకేసారి 22 లక్షలకు పైగా దీపాలను వెలిగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.ఈ దీపాలు గత సంవత్సరం కంటే 6.47 లక్షలు ఎక్కువ కావడం విశేషం.