Home / తప్పక చదవాలి
ముంబైలో జరిగిన 26/11 దాడుల 15వ వార్షికోత్సవానికి ముందు ఇజ్రాయెల్ మంగళవారం పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాను 'ఉగ్రవాద సంస్థగా జాబితాలో చేర్చింది. ముంబై ఉగ్రదాడుల జ్ఞాపకార్థం 15వ సంవత్సరానికి గుర్తుగా, ఇజ్రాయెల్ రాష్ట్రం లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా జాబితాలో చేర్చినట్లు న్యూ ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
: విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు ఆర్దిక సాయం చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. 60కి పైగా బో ట్ల దగ్ధం జరిగి నష్టపోయిన బోట్ల యజమానులకు ఒక్కొక్కరికి ఏభై వేల రూపాయలు ఆర్దిక సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని తెలిసింది. 22న వరంగల్, సూర్యాపేట, 23న తాండూర్, 24న కూకట్ పల్లి, 25న ఎల్బి నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలుచున్న అభ్యర్దులందరిలో అత్యంత ధనవంతుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డని వార్తలు వచ్చాయి. అయితే నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి అత్యంత ధనవంతుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వివేకానంద నిలిచారు
తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇవాళ నామినేషన్ల పరిశీలన అంకం మొదలైంది. ఈ నెల 15వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు విధించింది. పోటీ నుంచి తప్పుకోవాలనుకున్నవారు 15లోపు ఉపసంహరించుకోవాలని సూచించింది.
ఖమ్మం నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా తలపడుతున్న మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రత్యర్థిని ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశాన్నీ ఇద్దరూ వదులుకోవడం లేదు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్‌పై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది.టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.
హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు అధికారం దక్కదని బీజేపీలో చేరి పదవి పొందారని పురందేశ్వరిపై మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబుకోసం కొమ్ముకాస్తున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ లో ధ్వజమెత్తారు.
సిరియాలోని ఇడ్లిబ్ గవర్నరేట్‌లోని లక్ష్యాలపై రష్యా బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 34 మంది ఫైటర్లు మృతిచెందగా 60 మందికి పైగా గాయపడ్డాయని రష్యా యొక్క ఇంటర్ఫాక్స్ నివేదించింది. రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్ ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో సిరియన్ ప్రభుత్వ దళాల అక్రమ సాయుధ సమూహాల లక్ష్యాలపై వైమానిక దాడులు నిర్వహించిందని దాడి గురించి రియర్ అడ్మిరల్ వాడిమ్ కులిట్ చెప్పారు.