Home / తప్పక చదవాలి
డీప్‌ఫేక్‌ల గురించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం త్వరలో కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని లేదా ప్రస్తుత చట్టాలకు సవరణలు చేస్తుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. డీప్‌ఫేక్ వీడియోలు మరియు వాటిని హోస్ట్ చేసే ప్లాట్‌ఫారమ్‌ల సృష్టికర్తలకు జరిమానా విధించబడుతుందని ఆయన తెలిపారు.
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 29,267 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయనున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం తెలిపింది. ఇప్పటి వరకు 9,174 పోస్టల్ బ్యాలెట్లు అందాయని అధికారులు తెలిపారు
చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తన్న గడ్డం వివేక్ నివాసాలు, కార్యాలయాలపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల కింద మంగళవారం సోదాలు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) రూ.100 కోట్లకు పైగా లావాదేవీలను గుర్తించింది.
జమ్ము కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ధర్మశాల సమీపంలోని బజిమాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఓ అధికారి, సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి గాయాలయ్యాయని వెల్లడించారు.
రేమాండ్ సీఎండి గౌతమ్ సింఘానియా భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే రేమాండ్ షేర్లు స్టాక్ మార్కెట్లో గణనీయంగా తగ్గముఖం పట్టడం మొదలయ్యాయి. వరుసగా ఏడు రోజుకూడా రేమాండ్ షేర్లు నేల చూపులు చూశాయి. భార్య నవాజ్ మోదీ తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీంతో వెంటనే వారు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకొని బయటపడుతున్నారు.
విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ని బెదిరించినందుకుగానూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని మంగళవారం రాత్రి సంతోష్ నగర్ పిఎస్ పరిధిలోని మొయిన్ బాగ్‌లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించారు. అయితే రాత్రి 10 గంటలకి కావస్తుండటంతో విధుల్లో ఉన్న సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ శివచంద్ర ప్రచార గడువు ముగిసిందని అక్బరుద్దీన్‌కి చెప్పేందుకు స్టేజిపైకి వెళ్ళారు.
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. బుధవారం కొడంగల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీకి రూ.50 లక్షలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తీరును గుర్తు చేశారు. జైలుకు వెళ్లినా రేవంత్ రెడ్డిలో మార్పు రాలేదని కేసీఆర్ అన్నారు.
తనకు ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మను ఇచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం వరంగల్‌లో బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసారు. ఈ సందర్బంగా హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరై ఆయన ప్రసంగించారు.
యాడ్స్‌లో తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లపై యోగా గురువు రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేదాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఒక నిర్దిష్ట వ్యాధిని నయం చేయగలదని తప్పుడు క్లెయిమ్ చేస్తే, ప్రతి ప్రొడక్టుపై రూ. 1 కోటి రూపాయలు జరిమానా విధించబడుతుందని తెలిపింది.
యూరప్ లో విపరీతమైన వేడి కారణంగా గత ఏడాది 70,000 మరణాలు సంభవించాయని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ (ISGlobal) శాస్త్రవేత్తలు వేడి-సంబంధిత మరణాలను కొలిచే ఫ్రేమ్‌వర్క్‌లో మార్పులు చేసిన తర్వాత వారి మునుపటి అంచనా 61,000ని సవరించారు.