Home / తప్పక చదవాలి
: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన దైన సింప్లిసిటీతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. విషయానికి వస్తే ఓ అభిమాని తన మోటార్ బైక్ పై ధోని ఆటోగ్రాఫ్ అడిగాడు. దీనితో ధోని తన అభిమాని ట్రయంఫ్ రాకెట్ 3R మోటార్సైకిల్నుముందు తన స్వంత టీ-షర్ట్‌తో శుభ్రం చేసి సంతకం పెట్టాడు.
గురువారం నాడు జరగబోతున్న తెలంగాణ శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల విషయానికి వస్తే 24 శాతం నుంచి 72 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ రికార్డులున్నాయని తేలింది. పోటీ చేస్తున్న అన్ని పెద్ద పార్టీలు తమ పార్టీ అభ్యర్థులపై క్రమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించాయి.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని వికాస్ రాజ్ రాజకీయనాయకులకు సూచించారు.
దక్షిణాఫ్రికాలోని ప్లాటినం గనిలో కార్మికులను తీసుకెళ్తుండగా ఒక ఎలివేటర్ అకస్మాత్తుగా 200 మీటర్లు (656 అడుగులు) కిందకు పడిపోవడంతో 11 మంది మృతి చెందగా, 75 మంది గాయపడ్డారని గని ఆపరేటర్ మంగళవారం తెలిపారు.ఉత్తర నగరంలోని రస్టెన్‌బర్గ్‌లోని గనిలో కార్మికుల షిఫ్ట్ ముగింపులో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.
ఉత్తర కొరియా తన మొదటి గూఢచారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్లు పేర్కొంది, ఇది గత వారం కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది. ఈ ఉపగ్రహం వైట్ హౌస్, పెంటగాన్ మరియు సమీపంలోని యుఎస్ నావికాదళ స్టేషన్ల ఫోటోలు తీసిందని కొరియా మీడియా పేర్కొంది.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసుకు వచ్చే సమయం దగ్గర పడిందని ఒక అధికారి మంగళవారం తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సోషల్ మీడియా పోస్ట్‌లో కార్మికులను బయటకు తీయడానికి సొరంగంలో పైపులు వేసే పని పూర్తయింది అని ధృవీకరించారు.
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య తాత్కాలిక సంధిని మరో రెండు రోజులు పొడిగించినట్లు మధ్యవర్తి కతార్ సోమవారం ప్రకటించింది.మరో 33 మంది పాలస్తీనా ఖైదీల విడుదలతో పాటుగా గాజా నుండి మరో 11 మంది బందీలను వదిలిపెట్టిన తరువాత సంధి పొడిగింపు జరిగింది.
వారణాసి జిల్లా కోర్టులో జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించిన శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మరో 21 రోజుల గడువు కోరింది. ఏఎస్ఐ తన నివేదికను నవంబర్ 28న సమర్పించవలసి ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గతవారం ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు విననుంది
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి చంద్రబాబు హయాంలో కంటే 13.2 లక్షల కోట్లకు పెరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం దేశంలోనే పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 5వ స్థానంలో ఉందన్నారు. ఇవన్నీ పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరికి కనిపించడంలేదని మండిపడ్డారు.