Home / తప్పక చదవాలి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్‌షో సాగింది. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. ప్రధాని మోదీపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.
దేశంలోని కొన్ని సంపన్న కుటుంబాలు విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు జరిగిన ''మన్ కీ బాత్'' కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ వేడుకలను భారత్‌లోనే చేసుకువాలని వారికి విజ్ఞప్తి చేశారు. అందువల్ల దేశంలోని సొమ్ము దేశాన్ని వీడి వెళ్లదని అన్నారు. వివాహాల కోసం షాంపింగ్ చేసేటప్పుడు ఇండియాలో తయారైన ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్న ఆ పార్టీ వ్యాఖ్యలపై ఆలిండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇది విభజన రాజకీయాలకు అద్దంపడుతోందన్నారు.
14 మంది సిబ్బందితో ఉప్పును తీసుకెళ్తున్న కార్గో షిప్ లెస్బోస్ ద్వీపంలో మునిగిపోవడంతో ఒకరు మరణించగా, 12 మంది తప్పిపోయినట్లు గ్రీక్ కోస్ట్ గార్డ్ తెలిపింది.కొమొరోస్-ఫ్లాగ్డ్ రాప్టర్ ఈజిప్ట్‌లోని ఎల్ దేఖీలా ఓడరేవు నుండి ఇస్తాంబుల్‌కు బయలుదేరి వెడుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.
చైనాలో ప్రతి ఏటా జరిగే సివిల్ సర్వీస్ పరీక్షకు మూడు మిలియన్లకు పైగా అభ్యర్దులు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్దాయిలో హాజరు ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన ఉద్యోగాన్ని పొందడం గురించి యువతలో పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 2.5 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉంటారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటివరకు 1,68,612 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా నవంబర్ 26 వరకు 96,526 పోలింగ్ జరిగినట్లు తెలిపారు.
వివాహ వేడుక అనేది జీవితాంతం మరచిపోలేని వేడుక కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని గుర్తుండిపోయేలా ఘనంగా చేసుకుందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి గాను కొంతమంది విదేశాలకు కూడ తరలి వెడుతున్నారు. ఇలా ఉండగా తన కుమార్తె ప్రత్యేక రోజును గుర్తుంచుకోవడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన భారతీయ వ్యాపారవేత్త దిలీప్ పాప్లీ ఇటీవల ఒక ప్రైవేట్ విమానంలో వివాహాన్ని నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జైలు సమీపంలోని భన్సీలో సోమవారం తెల్లవారుజామున నక్సలైట్లు నిర్మాణ సంస్థకు చెందిన 16 వాహనాలకు నిప్పు పెట్టారు.దంతేవాడ నుండి బైలదిల్లా రోడ్డు వరకు విస్తరించేందుకు కంపెనీ భాన్సీలోని బెంగాలీ క్యాంపు సమీపంలో క్యాంపును ఏర్పాటు చేసింది. సోమవారం తెల్లవారుజామున నక్సలైట్లు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించి వాహనాలకు నిప్పు పెట్టారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు, 2023, డిసెంబర్ 4 నుండి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మలేషియాలో పర్యటించే భారతదేశం మరియు చైనా పౌరులకు డిసెంబర్ 1 నుండి వీసా రహిత ప్రవేశాన్ని మలేషియా ప్రారంభించనున్నట్లు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. అంటే, ఇప్పుడు భారతీయులు మలేషియాకు వెళ్లడానికి వీసా తీసుకోవలసిన అవసరం లేదు. భారతీయ మరియు చైనా పౌరులు వీసా లేకుండా మలేషియాలో 30 రోజుల వరకు ఉండవచ్చు.