Home / తప్పక చదవాలి
ఖతార్- మరియు ఈజిప్ట్ మధ్యవర్తిత్వ ఒప్పందం శుక్రవారం అమలులోకి వచ్చినప్పటి నుండి హమాస్ 50 మందికి పైగా ఇజ్రాయెల్ మహిళలు మరియు పిల్లలను విడుదల చేసారు. వారిలో 17 మంది థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారు.అక్టోబరు 7న హమాస్ దాడుల్లో పట్టుబడిన 160 మందికి పైగా బందీలు ఇప్పటికీ గాజా స్ట్రిప్‌లో ఉన్నారు.
యునైటెడ్ స్టేట్స్ డిసెంబర్లో కొన్ని వర్గాల H-1B వీసాలను దేశంలోనే రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. దీనిద్వారా స్వదేశాలకు వెళ్లకుండా ఎన్నారైలు తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. ఇది గణనీయమైన సంఖ్యలో భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం టీమ్ ఇండియా (సీనియర్ పురుషులు) కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో రాహుల్ ద్రావిడ్ భారత ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మరియు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌తో సహా సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యుల ఒప్పందాలను కూడా బిసిసిఐ పొడిగించింది.
పేదలకు నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ పథకం కింద, కేంద్రం 1 జనవరి 2023 నుండి పిఎంజికెఎవై కింద అంత్యోదయ అన్న యోజన (AAY) గృహాలు మరియు ప్రాధాన్యతా గృహాల (PHH) లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తోంది.
తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటికి 15 ఏళ్లు అయిన సందర్బంగా నాటి చైతన్యాన్ని గుర్తు తెచ్చుకుందామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో , తెలంగాణ వచ్చుడో అని నినదించిన నేత కేసీఆర్ అని అన్నారు.
మీరు గెలిపించకపోతే డిసెంబర్ 4న నా శవయాత్రకి రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. తక్షణమే ఈ వ్యాఖ్యలపై స్థానిక రిటర్నింగ్ అధికారికి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో కౌశిక్ రెడ్డి తనకి ఓటేయాలంటూ అడిగిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
డిజిటల్ మోసాలను అరికట్టేందుకు గాను అనుమానాస్పద లావాదేవీలు జరుపుతున్న 70 లక్షల మొబైల్ నంబర్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు మోసాలను నిరోధించేందుకు బ్యాంకులు తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు.
17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.
: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి తన దైన సింప్లిసిటీతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. విషయానికి వస్తే ఓ అభిమాని తన మోటార్ బైక్ పై ధోని ఆటోగ్రాఫ్ అడిగాడు. దీనితో ధోని తన అభిమాని ట్రయంఫ్ రాకెట్ 3R మోటార్సైకిల్నుముందు తన స్వంత టీ-షర్ట్‌తో శుభ్రం చేసి సంతకం పెట్టాడు.
గురువారం నాడు జరగబోతున్న తెలంగాణ శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల విషయానికి వస్తే 24 శాతం నుంచి 72 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ రికార్డులున్నాయని తేలింది. పోటీ చేస్తున్న అన్ని పెద్ద పార్టీలు తమ పార్టీ అభ్యర్థులపై క్రమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించాయి.