Home / తప్పక చదవాలి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా-బార్కోట్ సొరంగంలో నవంబర్ 12న కూలిపోయిన తర్వాత అందులో రెండు వారాలుగా చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేశాయి, ఇందులో భాగంగా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీయడానికి ఆరు ప్రణాళికలను పరిశీలిస్తున్నారు.
రైతుబంధు నిలిపివేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో స్పందించారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదని రేవంత్ రెడ్డి అన్నారు
గుజరాత్లో విస్తారంగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు పిడుగులు పడి 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్ఈఓసీ ) అధికారి ఈ విషయాన్ని తెలిపారు.
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను ప్రధాని నరేంద్ర మోదీకి మిత్రుడంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో ఓవైసీ మాట్లాడుతూ రాహుల్‌కు ప్రాణంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఒకరు ఇటలీ, రెండో వ్యక్తి మోదీ అని అన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నేత కార్మికులను ఆదుకునేందుకు మక్తల్‌లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం మక్తల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను సర్వనాశనం చేసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పాలనలో 58 ఏళ్లు గోస పడ్డామని వారి పాలనలో సాగునీరు ,తాగునీరు, కరెంట్ లేవని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఆదివారం దుబ్బాకలోమ జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ 1969 ఉద్యమంలో400 మందిని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు.
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాసా్ 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు విదేశీయులను విడుదల చేసింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఆదివారం 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల మార్పిడిని చాలా గంటలు ఆలస్యం చేసింది.
చైనాలో న్యుమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం మరియు ఆసుపత్రుల సన్నద్ధతను సమీక్షించాలని కేంద్రం ఆదివారం రాష్ట్రాలను కోరింది. ఉత్తర చైనాలోని పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని ఇటీవలి నివేదికల దృష్ట్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఈ ప్రకటన వచ్చింది.
తెలంగాణలో మొదటి సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ప్రధాని మోదీ తూప్రాన్ సకల జనుల సంకల్ప సభలో ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని మోదీ అన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీ తోనే సాధ్యమని మోదీ చెప్పారు. గద్వాలలో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారని, ఓటమి భయంతోనే కేసిఆర్ కామారెడ్డినుంచి కూడా పోటీ చేస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.
జనసేన, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాపు సంక్షేమ సేన నాయకులు కృషి చేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.