Home / తప్పక చదవాలి
బీహార్‌లోని సివాన్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల కారణంగా రెండు వంతెనలు కూలిపోయాయి, రాష్ట్రంలో గత 15 రోజులలో బ్రిడ్జిలు కూలిపోయిన వాటిలో ఇది ఏడవ సంఘటన. అయితే బ్రిడ్జిలు కూలిపోయిన నేపధ్యంలో ఎవరూ మరణించలేదని, గాయపడలేదని అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని నగరం ప్రాముఖ్యతను, అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరిస్తూ ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూరాజధాని పేరును కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు.
బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్, రిమోట్పైలట్తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు 3వ రోజు పిఠాపురంలో పర్యటించారు. ఉప్పాడ కొత్తపల్లిలో తీరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. కోతకు గురవుతున్న తీరును అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా పవన్‌కు వివరించారు. అనంతరం అక్కడి నుంచి చేబ్రోలులో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం స్వయం ప్రకటిత సాధువు భోలే బాబా నేతృత్వంలోని మతపరమైన సమ్మేళనం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 116 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పటి నుండి అతని ఆచూకీ తెలియలేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిని విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబసభ్యులు.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ 'షోలే' సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
కాకినాడ కలెక్టరేట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, అటవీ, పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాటలో 80 మందికి పైగా మరణించారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారు. మృతులను హత్రాస్ మరియు పొరుగున ఉన్న ఎటా జిల్లాలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త రిషి షా తన అడ్వర్టైజింగ్ స్టార్టప్‌కు సంబంధించిన రూ8,300 కోట్ల మోసానికి పాల్పడినట్లు రుజువుకావడంతో అతనికి ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు