Last Updated:

White Paper on Amaravati: ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి. . సీఎం చంద్రబాబు నాయుడు

ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని నగరం ప్రాముఖ్యతను, అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరిస్తూ ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూరాజధాని పేరును కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు.

White Paper on Amaravati: ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి. . సీఎం చంద్రబాబు నాయుడు

White Paper on Amaravati: ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని నగరం ప్రాముఖ్యతను, అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరిస్తూ ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూరాజధాని పేరును కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం (White Paper on Amaravati)

శంకుస్థాపన సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి దేశంలోని ప్రతి పవిత్ర స్థలం నుంచి మట్టి, నీరు తీసుకొచ్చారు. యమునా నది నుంచి మట్టి, నీటిని తీసుకొచ్చి ప్రధాని మోదీ కూడా పాల్గొని ప్రాజెక్టుకు మద్దతు తెలిపారని అన్నారు.శాతవాహనుల కాలం నుంచి అమరావతి ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా ఉందని ఆయన గుర్తు చేసారు. అమరావతిలోనే ఎందుకు రాజధాని ఉండాలని అనేకమంది అడిగారు.రాష్ట్రంలో ఎటునుంచి చూసినా సమదూరం ఉన్న ప్రాంతం అమరావతి. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాలి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని కమిటీ చెప్పిందని చంద్రబాబు తెలిపారు.హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది. సైబరాబాద్ నిర్మించేటప్పుడు చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ అభివృద్ధికి కంపెనీలను తీసుకురావడానికి తాను 14 రోజులు అమెరికాలో గడిపానని చెప్పారు. తొమ్మిదేళ్లలో సైబరాబాద్‌కు పర్యావరణ వ్యవస్థను రూపొందించామని చంద్రబాబు చెప్పారు.

జగన్ యూ టర్న్..

ప్రాజెక్టులకు భూములిచ్చిన వారు సంతృప్తి చెందేలా ఎప్పుడూ విన్-విన్ విధానాన్ని అనుసరిస్తాయని చంద్రబాబు చెప్పారు. . రాజధాని మార్పు జరిగితే ఏం జరుగుతుందనేదానికి ఇది కేస్ స్టడీగా ఉంటుంది.అమరావతిలో రాజధాని ఏర్పాటుకు జగన్ మొదట మద్దతిచ్చారని, అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారని తర్వాత తన వైఖరి మార్చుకున్నారని అన్నారు. రాజధాని నిర్మాణానికి బ్యాంకులు, సింగపూర్ మద్దతిచ్చాయని, సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌ను అందించి, ఎంఓయూపై సంతకం చేశాయని ఆయన పేర్కొన్నారు. కేసుల బారిన పడిన అమరావతి రైతులకు న్యాయం చేస్తామన్నారు. అమరావతిలో పనులు మరలా ప్రారంభమయ్యాయని త్వరలోనే పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

ఇవి కూడా చదవండి: