Home / తప్పక చదవాలి
బీహార్ రాష్ట్రంలో రెండు వారాల్లో 12 వంతెనలు కూలిపోవడంతో 15 మంది ఇంజనీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్త వంతెనల పునర్నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది. వీటి నిర్మాణ వ్యయాన్ని దోషులుగా తేలిన కాంట్రాక్టర్లే భరించాలి.
నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ప్రధాని సహా 10 మంది కేంద్రమంత్రులను కలిశారు. ఏపీ అభివృద్ధి అంశాలపై ప్రధాని, కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు చేశారు.
: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. జోగి రమేష్ భూ దందాలో రికార్డులు తారుమారు చెయ్యడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యుల భూ వివాదంలో ముగ్గురిపై వేటు పడింది.
మాదాపూర్‌లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను నటుడు సోనుసూద్ సందర్శించారు. కాసేపు ఆమెతో సరదాగా ముచ్చటించారు. అనంతరం కుమారి ఆంటీ ఫుడ్ మెనూ రేట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. తాను కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి.. తన బాగోగులు అడిగి తెలుసుకున్నందుకు కుమారి ఆంటీ ధన్యవాదాలు తెలిపారు.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మీద ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది.
బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని రిషి సునాక్ కు షాక్ తగిలింది. ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ ఓడిపోయారు. యూకేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మెజార్టీ స్థానాలను ఆపార్టీ కైవసం చేసుకుంది.
బీఆర్ఎష్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి.. దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో దండే విఠల్, భాను ప్రసాద్.. ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్,..ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ఉన్నారు.
గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు గతంలో ఎన్నడూ లేని స్వాగతం లభించింది.అంతకుముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిని భారత క్రికట్ జట్టు సభ్యులు అనంతరం విజయోత్సవ ర్యాలీకోసం ముంబయ్ చేరుకున్నారు.
విజ్ఞానాభివృద్ధికీ, సుఖ సంతోషాలకు, క్షేమానికీ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఆరోగ్యానికి సూర్యారాధన ఎంతో అవసరమని చెబుతూ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూక్తిని ఆయుర్వేద నిపుణులు ప్రస్తావిస్తారు.