Manipal Hospitals : విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ లో అరుదైన ఈఎన్టీ సర్జరీ..
విజయవాడ లోని మణిపాల్ హాస్పిటల్స్ లో ఒక సంక్లిష్ట సర్జరీని హెడ్ &నెక్, కాక్లియర్ ఇంప్లాంట్, కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్లు నిర్వహించారు. డాక్టర్ వి.వి.కె. సందీప్ (కన్సల్టెంట్ – ఇఎన్టి,హెడ్&నెక్ సర్జరీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్),
Manipal Hospitals : విజయవాడ లోని మణిపాల్ హాస్పిటల్స్ లో ఒక సంక్లిష్ట సర్జరీని హెడ్ &నెక్, కాక్లియర్ ఇంప్లాంట్, కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్లు నిర్వహించారు.
డాక్టర్ వి.వి.కె. సందీప్ (కన్సల్టెంట్ – ఇఎన్టి,హెడ్&నెక్ సర్జరీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్), డాక్టర్ కొసురు శ్రీనివాస్ బాబు (సీనియర్ కన్సల్టెంట్ – కార్డియో థొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్) ఈ సంక్లిష్ట సర్జరీని చేశారు.
మెడలో మెటల్ వైర్ (Manipal Hospitals)..
ఈ సందర్భంగా డాక్టర్ వి.వి.కె. సందీప్ మాట్లాడుతూ.. ’46 ఏళ్ల మహిళ తన మెడలో మెటల్ వైర్, కుడి ఉమ్మడి కరోటిడ్ ఆర్టరీ సూడో అన్యూరిజం కారణంగా వాపు,నొప్పి, జ్వరం మరియు మెడ కదలికలలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది.
ఆమెను బాగా పరిశీలించిన తరువాత, వివిధ ల్యాబ్ పరీక్షల అనంతరం, రోగికి మెడలో మెటల్ వైర్ ను తొలగించడంతో పాటుగా సాఫెనస్ వైన్ ప్యాచ్ తో ఇన్ఫెక్టెడ్ సూడో అన్యూరిజం కు చికిత్స చేయాల్సిన అవసరం ఉందని నిర్ధారించడమైంది.
జనరల్ అనస్థీషియా కింద శస్త్రచికిత్స జరిగింది. తదనంతర సమయంలో ఎలాంటి అసాధారణ సంఘటనలు చోటు చేసుకోలేదు’’ అని అన్నారు.
‘‘సర్జరీకి ముందుగా, సర్జరీ అనంతర కాలంలో రోగికి ఇతర చికిత్సలతో పాటుగా బ్లడ్ ప్రోడక్ట్స్ ఇ చ్చారు.
రెండో రోజున రోగిని వార్డుకు మార్చారు. నోటి గుండా ఆహారం తీసుకోవడాన్ని అనుమతించారు.
రోగి సాధారణ ఆరోగ్యం నిలకడగా ఉంది.
ప్రస్తుతం ఆ రోగి సాధారణ ఆహారం తీసుకుంటున్నారు. గదిలో అటూ ఇటూ నడవగలుగుతున్నారు.
ఆపరేషన్ గాయం నయమవుతోంది. పోస్ట్ ఆపరేటివ్ టెస్ట్ ఫలితాల ప్రకారం, రోగి బాగా కోలుకుంటున్నారు.
తగు సలహాలతో ఆమెను డిశ్చార్జ్ చేశారు’’ అని డాక్టర్ వి.వి.కె సందీప్ వివరించారు.
హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఎంతో నైపుణ్యంతో విజయవంతంగా ఈ సర్జరీ చేసినందుకు గాను డాక్టర్ వి.వి.కె. సందీప్, డాక్టర్ కొసురు శ్రీనివాస్ బాబులకు, రోగి సంరక్షణలో తోడ్పడిన యావత్ వైద్య బృందానికి మా ధన్యవాదాలు.
విజయవాడ, రాష్ట్రానికి చెందిన ప్రజలకు అత్యుత్తమ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు మణిపాల్ హాస్పిటల్ విజయవాడ కట్టుబడి ఉంది అని అన్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/