Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్.. ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
Telangana Budget 2023: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.
Telangana Budget 2023: ప్రజాసంక్షేమమే లక్ష్యంగా.. ప్రగతిశీల రాష్ట్రమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేలా.. వార్షిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మెుత్తం 2.90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. సబ్బండ వర్గాల అభివృద్దే ధ్యేయంగా.. అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ.. బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అన్ని సామాజిక వర్గాలకు అనుగుణంగా.. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు భేదం లేకుండా కేటాయింపులు చేసినట్లు మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో.. రాష్ట్రం అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని మంత్రి అన్నారు. ప్రజాసంక్షేమంలో యావత్ దేశానికి.. తెలంగాణ ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. నేడు జాతీయ.. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప పేరు వచ్చిందని తెలుపుతూ హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రసంగం 1 గంట 44 నిమిషాల పాటు కొనసాగింది. 10:30 గంటలకు ప్రారంభమైన బడ్జెట్ ప్రసంగం.. మధ్యాహ్నం 12:14 గంటల వరకు కొనసాగింది.
రానున్న రోజుల్లో జాతి నిర్మాణంలో తెలంగాణ క్రీయశీల పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.
రాష్ట్ర ప్రజల జీవితాల్లో సంపూర్ణమైన వికాసాన్ని సాధించేంత వరకు.. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు.
ఈ మహా సంకల్పానికి.. తెలంగాణ ప్రజానీకం సహకరించాలని కోరుతూ.. మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
బడ్జెట్ ప్రసంగం అనంతరం..ఉభయ సభలను బుధవారానికి వాయిదా వేశారు. ఈ నెల 8న బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 9,10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై సమావేశాల్లో చర్చించనున్నారు.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్..
రాష్ట్రంలో మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఈ మేరకు ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 12,161 కోట్లు కేటాయించారు.
నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
బస్తీ దవఖానాలు, పల్లె దవాఖానాలపై ప్రభుత్వం ప్రత్యేక చొరత తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
దళితబంధు..
దళితుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. వారి అభివృద్ధి కోసం ఈ సారి బడ్జెట్ Telangana Budget 2023లో రూ.17,700 కోట్లు కేటాయించారు.
దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికి దళితవాడలు వెనుకబాటుతనానికి చిరునామాలుగానే ఉండిపోతున్నాయి.
వాటి నిర్మూలనే లక్ష్యంగా.. ఈ పథకం కోసం నిధులు పెంచినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే సంకల్పంతో కేసీఆర్ ఈ పథకానికి రూపుదిద్దారు.
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట..
రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అందులో భాగంగానే విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.
పేద పిల్లలు చదువులో ముందుండాలనే లక్ష్యంతో గురుకుల విద్యకు పెద్దపీట వేశారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు 293గా ఉన్న గురుకులాల సంఖ్య.. ప్రస్తుతం 1,002కు పెంచామని మంత్రి తెలిపారు.
వసతుల లేమితో 1.31 లక్షల మంది విద్యార్థులు గురుకులాల్లో చదివేవారని… సకల వసతులతో ఇప్పుడు 5.59 లక్షల మంది విద్యార్థులు గురుకుల విద్యను అభ్యసిస్తున్నారు.
గతంలో గురుకులాలకు బడ్జెట్ కేటాయింపులు రూ.784 కోట్లు ఉండగా.. 2022-23 నాటికి అది 3,400 కోట్లకు పెరిగింది.
అలాగే.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం మన ఊరు మన బడి అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇందులో 26,065 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చనున్నారు. దీనికోసం బడ్జెట్‌లో రూ.7,289 కోట్ల నిధులను కేటాయించారు.
యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లను కేటాయించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/