Home / తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఢిల్లీ కి చేరుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా ముగ్గురు అధికారులతో కూడిన ఈడీ స్పెషల్ టీమ్ కవిత ను ప్రశ్నిస్తున్నారు.
Malla Reddy: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల మంత్రి మల్లారెడ్డి స్పందించారు. కవితకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Comments: జగిత్యాల జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణలో ఈడీ తలచుకుంటే.. కవితను గంటలో అరెస్ట్ చేసి జైలుకి పంపవచ్చని అన్నారు. అలా చేయకుండా కేవలం పబ్లిసిటీ కోసమే.. బీజేపీ- బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని ఆరోపించారు.
సంజయ్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. సదరు వ్యాఖ్యలపై తక్షణమే విచారణ జరపాలని డీజీపికి ఆదేశించింది.
Woman Sarpanch: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వెడేక్కుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ మహిళ సర్పంచ్ ఆరోపణలతో పెను ప్రకంపనలు మొదలయ్యాయి.
Bandi Sanjay Comments: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు.
MLC Kavitha: దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈడీ కార్యాలయం ఎదుట నిరసనలు జరుగవచ్చన్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద మీడియాకు అనుమతిని నిరాకరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఇప్పుడు తాజాగా వార్తల్లో నిలిచారు. కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు కోడైకూస్తున్నాయి. ఈ మేరకు కిరణ్ కుమార్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లోనే కాంగ్రెస్కు రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో బీజేపీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. గతంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో.. బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో పోస్టర్లు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.
డిల్లీ లిక్కర్ స్కామ్ విషయం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుండగా ఇప్పటివరకు 11 మందిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై ని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.