Last Updated:

Preeti Died: ప్రీతి కన్నుమూత.. ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

Preeti Died: ప్రీతి మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రీతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రూ. 10 లక్షలతో పాటు.. మరో రూ. 20 లక్షలను ఆర్ధిక సాయం ప్రకటించేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Preeti Died: ప్రీతి కన్నుమూత.. ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్

Preeti Died: అయిదు రోజులుగా మృత్యువుతో పోరాడి.. ప్రీతి కన్నుమూసింది. ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ వైద్య విద్యార్ధిని.. నిమ్స్ లో అయిదు రోజులుగా చికిత్స పొందుతూ రాత్రి 9.10 గంటలకు తుదిశ్వాస విడిచింది. ఈ మేరకు నిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

నిమ్స్‌లో అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత (Preeti Died)

ప్రీతి మరణించిందని వైద్యులు తెలపగానే ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి వరకు హై డ్రామా కొనసాగింది. కాకతీయ మెడికల్‌ కళాశాల అనస్థీషియా విభాగం హెచ్‌వోడీని సస్పెండ్‌ చేయాలని.. సస్పెండే చేసిన తర్వాతనే మృతదేహన్ని తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని కోరారు. ప్రీతి మృతిపై సమగ్ర నివేదిక కావాలని తండ్రి నరేందర్‌ అన్నారు. మరణానికి గల కారణాలను వివరిస్తేనే.. మృతదేహాన్ని తీసుకువెళ్తామని పట్టుబట్టారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేయగా.. కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ఐసీయూ గ్లాస్‌ డోర్‌ను బద్దలుకొట్టారు. ప్రీతి కి చెందిన కొందరు బంధువులు.. అంబులెన్స్‌కి అడ్డుపడటంతో పాటు తాళం లాక్కున్నారు. దీంతో కొందరిని వాహనాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో.. ప్రీతి తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మళ్లీ ఐసీయూకు తరలించారు. ప్రీతి మృతదేహాన్ని ప్యాక్‌ చేసి పంపుతాం అని ఓ వైద్యుడు అనడం చర్చనీయంశంగా మారింది. దీనిపై బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ పరీక్ష నిర్వహించేందుకు గాంధీలో వైద్యులు ఏర్పాట్లు చేశారు.

ప్రీతి కుటుంబానికి ఆర్ధిక సాయం..

ప్రీతి మృతి చెందిన ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రీతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రూ. 10 లక్షలతో పాటు.. మరో రూ. 20 లక్షలను ఆర్ధిక సాయం ప్రకటించేలా చూస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రీతి మృతిపై పలువురు నేతలు స్పందించారు. ప్రీతి మృతి.. తన మనసును తీవ్రంగా కలిచివేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ మేరకు సంతాపం ప్రకటించారు.

 

ఈ ఘటనపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు. ప్రీతి మృతిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షర్మిల సైతం సంతాపం తెలిపారు. హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు సైతం హామీ ఇచ్చారని చెప్పారు. ర్యాగింగ్‌ కు నిరసనగా సోమవారం వైద్య, విద్యాసంస్థల రాష్ట్ర బంద్‌కు ఏబీవీపీ తెలంగాణ పిలుపునిచ్చింది.

గాంధీ ఆస్పత్రికి ప్రీతి మృతదేహం..

ఉద్రిక్తత నడుమ ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షకు మెుదట తల్లిదండ్రులు నిరాకరించారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను తెలపాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రీతిని చంపాడానికే ఇంజక్షన్ ఇచ్చారని ఆరోపించారు. ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసిన.. ఎందుకు పట్టించుకోలేదని ప్రీతి తల్లిదండ్రులు ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రీతి తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. వారు అంగీకరించడంతో శవపరీక్షకు తరలించేందుకు ఒప్పుకున్నారు. గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లకుండా ప్రీతి బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. శవపరీక్షకు తమను అనుమతించాలని వారు డిమాండ్‌ చేశారు. శవపరీక్ష పూర్తి అయిన అనంతరం పోలీసు భద్రత మధ్య కుటుంబ సభ్యులకు ప్రీతి మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ప్రీతి మృతదేహాన్ని స్వస్థలం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు తరలించారు.

 

ప్రీతి మరణ వార్త తెలియడంతో విద్యార్థి సంఘాల నేతలు, భాజపా కార్యకర్తలు నిమ్స్‌ వద్ద భారీగా మోహరించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రీతి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రీతి స్వగ్రామంలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రీతి మృతికి కారణమైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పీజీ వైద్య విద్యార్ధిని పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని అత్మహత్యాయత్నం చేసింది. నిమ్స్ లో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.