Last Updated:

Nara Lokesh: జగన్ ఈడీ, సీబీఐకు భయపడుతున్నారు.. నారా లోకేష్

ఏపీకి జగన్ సీఎం అయిన దగ్గరి నుంచి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతా అనే చర్చే జరుగుతోందని విమర్శించారు.

Nara Lokesh: జగన్ ఈడీ, సీబీఐకు భయపడుతున్నారు.. నారా లోకేష్

Andhra Pradesh: ఏపీకి జగన్ సీఎం అయిన దగ్గరి నుంచి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతా అనే చర్చే జరుగుతోందని విమర్శించారు. గత 3 ఏళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమా తెలుగుదేశం ప్రభుత్వ కృషి వల్లే వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈడీ, ఐటీ, సీబీఐకి జగన్ భయపడుతున్నారని, రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమి తీసుకు వచ్చారో చెప్పలని అన్నారు. సీఎంకు సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని వచ్చేవారం భయటపెడతానన్నారు.

ఇవి కూడా చదవండి: