Last Updated:

Varahi Vijaya Yatra: విశాఖ జిల్లాలో వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఇదే..

విశాఖ పట్టణం జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్‌ని ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని రుషికొండని పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. 12వ తేదీన పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకి గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు.

Varahi Vijaya Yatra: విశాఖ జిల్లాలో వారాహి విజయయాత్ర షెడ్యూల్ ఇదే..

Varahi Vijaya Yatra: విశాఖ పట్టణం జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్‌ని ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం భీమిలి నియోజకవర్గంలోని రుషికొండని పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. 12వ తేదీన పెందుర్తి నియోజకవర్గంలో వాలంటీర్ చేతిలో హత్యకి గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు.

17న జనవాణి..(Varahi Vijaya Yatra)

అదే రోజు సాయంత్రం 4 గంటలకి విశాఖ నగరంలో సిఎన్‌బిసి ల్యాండ్స్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. 13వ తేదీన గాజువాక నియోజకవర్గంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 14వ తేదీన అనకాపల్లి నియోజకవర్గంలోని విస్సన్న పేటలో ఆక్రమణకి గురైన భూముల సందర్శిస్తారు. 15వ తేదీన మంగళగిరి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. 16వ తేదీన భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బలని పరిశీలిస్తారు. 17వ తేదీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రజలతో మాట్లాడతారు. 18వ తేదీ టూర్ వివరాలపై తరువాత ప్రకటిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్‌పై జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలతో చర్చించారు.