Home / ప్రాంతీయం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. బుధవారం నాడు భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. అనంతరం జనసేనాని మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర దోపిడీ ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఆసియా ఖండంలో కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ దళిత వివాహితపై దాడి జరిగింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మనుష్యులు కానీ మనుషులు.. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో తెల్లవారితే స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే సందర్భంలో తమ కుమార్తె వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వెళ్లిపోయిందనే
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.. హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో అట్‌హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు కూడా హాజరయ్యారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న
1997లో ప్రజా గాయకుడు గద్దర్‌పై జరిగిన కాల్పుల ఘటనలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కాల్పుల అనంతరం గద్దర్ తనతో పలుమార్లు మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు. అల్వాల్‌లోని ప్రజా గాయకుడు గద్దర్ నివాసానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులని పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో ఎక్కువగా విమర్శల పాలవుతున్నవారిలో పోలీసులు కూడా ఒకరు. సాధారణంగా అసలు పని చేయకుండా.. కొసరు పనులు చేస్తూ ప్రజల్ని అడ్డగోలుగా దోచుకునే వారిలో రాజకీయ నేతలు మొదట ఉంటే.. వారి తర్వాత పోలీసులు ఉంటారని సగటు మనిషి అభిప్రాయపడుతుంటారు.
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ప్రస్తుతం పార్టీ ఆఫీసులో జనసేన వీర మహిళలతో పవన్ సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో గల ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగరవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. రైతులను ఆదుకునేందుకు పంట బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో దూసుకుపోతున్నారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా పర్యటిస్తున్న ఆయన నేడు అనకాపల్లి నియోజకవర్గంలోని విస్సన్నపేట గ్రామంలో పర్యటించారు. ఈ మేరకు ముందుగానే తన పర్యటన వివరాలను పవన్ ప్రకటించడంతో.. అడుగడుగునా పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పలుకుతూ భారీ
తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు.