Home / ప్రాంతీయం
ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణని మానుకోవాలని, అభివృద్ధి అంతా అమరావతిలో కేంద్రీకరించడాన్ని కూడా వదిలేయాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. రాజధాని వ్యవహారంపై విశ్లేషణ చేస్తూ జోగయ్య ఓ సంచలన లేఖ విడుదల చేశారు.
గాజవాక నా నియోజక వర్గం.. దీన్ని నేను వదిలి పెట్టను.. నేను ఓడిపోయాను కాని నా ఆశయం ఓడిపోలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో బాగంగా ఆదివారం రాత్రి గాజువాక బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
విశాఖలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని ప్రేమించి మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. కొత్తపాలెం నాగేంద్రకాలనీకి చెందిన బాలిక ఇటీవల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. 2021 జనవరి 18న బీజేపీలో చేరిన చంద్రశేఖర్.. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి లేఖ పంపారు. కేంద్ర ప్రభుత్వం అన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి వత్తాసు పలకడం ప్రజాకంఠకంగా మారడంతో తప్పనిసరై రాజీనామా చేస్తున్నానని చంద్రశేఖర్ తన లేఖలో పేర్కొన్నారు
హైదరాబాద్ శివార్లలోని హకీంపేటలో ఉన్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. విశాఖపట్నంలో వారాహి విజయ యాత్రపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. విశాఖకు చెందిన పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఇప్పటికే రెండు విడుతల విజయవంతం కాగా మూడో విడత
తిరుమల నడకదారిలో చిరుత పులులు వరుసగా దాడులు చేస్తూ చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. కాగా తాజాగా తిరుమలలో చిరుత దాడిలో 6 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలిపిరి మెట్ల మార్గంలో శుక్రవారం రాత్రి బాలిక తప్పిపోయింది. ఆ తర్వాత ఆ చిన్నారిపై ఎలుగుబంటి
ఇటీవల వాలంటీర్ చేతిలో హత్య చేయబడ్డ పెందుర్తి వాసి వరలక్ష్మి గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం ఎంతటి కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె మెడలో చైన్ ని కూడా దొంగతనం చేశాడు. కాగా ఇప్పుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అక్కడ నుంచి మీకోసం ప్రత్యేకంగా ప్రత్యక్షప్రసారం..
కేసీఆర్, కేటీఆర్, బిఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ ఎంపి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నిజ స్వరూపం బయటపడిందని భయపడుతున్నారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. ప్రజలని దోచుకోవడం ద్వారా మీ ఆదాయం ఎలా పెరిగిందో అందరికీ తెలిసిపోయిందని బండి సంజయ్ అన్నారు.
విశాఖలోని రుషికొండలో జనసేన అధినేత పవన్ పర్యటించారు. ఆంక్షల మధ్యే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. రుషికొండపై నిర్మాణాలను బయటి నుంచే పరిశీలించారు. చట్టాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రుషికొండపై పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు.