Home / ఆంధ్రప్రదేశ్
AR Rahman Visits Kadapa Dargah: ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కడపలో సందడి చేశారు. అక్కడ ఘనంగా జరుగుతున్న అమీన్ పీర్ పెద్ద దర్గా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ దర్గా ప్రతి ఏడాది అమీన్ పీర్ పెద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతీ ఏటా ఏఆర్ రెహమాన్ ఈ వేడుకల్లో కుటుంబంతో సహా పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఆయన కుటుంబ సమేతంగా […]
Chandrababu Naidu Brother Died: హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి నారా రామ్ముర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు అనే విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నేడు (నవంబర్ 16)న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే సీఎ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు హైదరాబాద్‌కు బయలుదేరారు. తమ్ముడి […]
AP Assembly Budget Session: గత ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశమని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లల్లో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం జీఓలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాగ్‌కు కూడా నివేదికల అందించలేదని వెల్లడించారు. రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు విమర్శలు చేశారు. జగన్ […]
TDP MLA Raghurama Krishnam Raju: వైసీపీ అధినేత జగన్‌ను జీవితాంతం జైలులో ఉంచినా తప్పులేదని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. గురువారం అసెంబ్లీలో రుషికొండ ప్యాలెస్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుషికొండ ప్యాలెస్‌లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనన్నారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఖరీదైన ఫర్నిచర్ నేనెక్కడా చూడలేదు.. రుషికొండ ప్యాలెస్‌లో వాడినంత ఖరీదైన ఫర్నిచర్ నేనెక్కడా చూడలేదని విష్ణుకుమార్‌రాజు […]
Deputy CM Pawan Kalyan About RRR: నవ్విన నాప చేనే పండిందన్న సామెత నిజమైంది. ఎవరినైతే… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వమని సవాల్ చేశారో… వారే అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. ఆ ఛాలెంజ్ చేసిన వారే కనీసం సభలోకి కూడా రాకుండా జనం గత ఎన్నికల్లో స్క్రిప్ట్ రాశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దీనికి సాక్ష్యం కాగా.. డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు […]
KTR Comments On Congress Government: రాష్ట్రంలో సాగుతోంది ఇందిరమ్మ రాజ్యం కాదని, ఇందిర ఎమర్జెన్సీ పాలన అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పట్నం నరేందర్ రెడ్డిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్ అని ఆరోపించారు. బుధవారం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సీఎం తన సొంత అల్లుడు సత్యనారాయణరెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ కోసమే ఫార్మా విలేజ్ అంటూ నాటకాలడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ విధానాలతోనే లగచర్ల ఘటన జరిగిందన్నారు. […]
AP Assembly Budget Session 2024: ప్రతిపక్ష పార్టీ విమర్శలు, అధికార పక్షం ప్రతి విమర్శలతో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బుధవారం వాడీవేడిగా చర్చలు సాగాయి. డయేరియా మృతులకు తప్పు ప్రభుత్వానిదే అని వైసీపీ చేసిన ఆరోపణలను అధికార పక్షం ధీటుగా తిప్పి కొట్టింది. ప్రజారోగ్యం, గ్రామీణ నీటి సరఫరా, అభివృద్ధికి వెచ్చిస్తున్న నిధుల వివరాలను ఆధారాలతో సహా వివరించింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలను లెక్కలతో సహా ఎండగట్టింది. ప్రజా భద్రత పట్ల […]
Police Notice to Director Ram Gopal Varma: డైరెక్టర్ రాజమౌళికి పోలీసులు నోటీసులు అందాయి. ఈనెల 19న విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఓంగోలు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వ్యూహం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. […]
Legal Notice to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు విషయమై ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ బయలుదేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆర్జీవీ ‘వ్యూహం’ చిత్ర ప్రమోషన్స్‌లో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వారిని కించపరుస్తూ ఎక్స్ వేదికగా వరుసగా […]
AP Budget 2024-25: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రానికి ఊపిరి దొరికింది. గత 5 ఏళ్లు అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్.. పేదల పాలిట వరంగా మారింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు ఆర్థిక ప్రగతి, విద్య, వైద్యం, వ్యవసాయానికి భారీగా కేటాయింపులు జరిగాయి. సవాళ్లను ఎదుర్కొంటూ… సంక్షేమ శకానికి నాంది పలుకుతామని ఆర్థికమంత్రి ఈ […]