Home / ఆంధ్రప్రదేశ్
Chandrababu: వైఎస్ వివేకా హత్యపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయడు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి.. ఆ విషయాన్ని దాచడానికి అనేక కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. ఏలూరులో నిర్వహించిన తెదేపా నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా ఈరోజు కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ ముందు హాజరు కానున్నారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులివ్వగా.. అవినాష్‌రెడ్డి 3 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్యాలయం ముందు హాజరు కానున్నారు. ఈ కేసు తెలంగాణకు బదీలీ అయ్యాక అవినాష్ రెడ్డిని రెండోసారి సీబీఐ ప్రశ్నించనుంది.
మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి అదుపు తప్పుతోంది ఏమో అనుమానం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలుగుతుంది. రాజకీయ దాడులు, ప్రతిదాడులతో.. గన్నవరం రాజకీయాలు మరింత వేడెక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి.. ఇపుడు స్ధానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నియోజకవర్గల వారీగా కమిటీలను నియమించిన పవన్.. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ముందునేగా సెట్ చేసుకొనే పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. మరోవైపు సర్వేల కోలాహలం నెలకొంది.
కృష్టా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం నుంచి గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలకు స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.