Last Updated:

IIT Student : వీడిన హైదరాబాద్‌ ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్ కేసు.. కథ విషాదాంతం

గత ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ ఐఐటీ కార్తీక్ కథ విషాదంగా ముగిసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్‌ ఐఐటీహెచ్‌లో బీటెక్‌(మెకానికల్‌) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్‌ నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. జూలై 18న తల్లిదండ్రులు కార్తీక్ కు ఫోన్ చేయగా

IIT Student : వీడిన హైదరాబాద్‌ ఐఐటీ స్టూడెంట్ మిస్సింగ్ కేసు.. కథ విషాదాంతం

IIT Student : గత ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన హైదరాబాద్ ఐఐటీ కార్తీక్ కథ విషాదంగా ముగిసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్‌ ఐఐటీహెచ్‌లో బీటెక్‌(మెకానికల్‌) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్‌ నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. జూలై 18న తల్లిదండ్రులు కార్తీక్ కు ఫోన్ చేయగా సమాధానం రాలేదు. ఎన్నిసార్లు చేసినా అలాగే వస్తుండడంతో అనుమానంతో కాలేజీకి వచ్చారు. దీంతో విషయం వెలుగు చూసింది.

తల్లిదండ్రులు 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా విద్యార్థి విశాఖపట్నం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. గతవారం రోజులుగా పలు ప్రాంతాల్లో కార్తీక్ ఆచూకీ కోసం పోలీసులు, తల్లిదండ్రులు విస్తృతంగా గాలించారు. ముందుగా కార్తీక్ జన్మభూమి ఎక్స్ ప్రెస్ ఎక్కి విశాఖపట్నం బీచ్ లో తిరిగినట్టుగా సీసీ కెమెరాల్లో నమోదయ్యింది. బీచ్ పక్కనున్న బేకరీలో ఫుడ్ తిన్నట్టుగా కూడా గుర్తించారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు.

కానీ ఈరోజు ఊహించని రీతిలో చివరికి బీచ్ లో శవమై తేలాడు. కాగా కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తుండగా.. అందుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కార్తీక్ మృతితో అతని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థి మృతదేహం కేజీహెచ్‌కు తరలించారు.