Cheetah Attack : తిరుమలలో 6 ఏళ్ల చిన్నారిపై దాడి చేసి చంపిన చిరుత.. వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు
తిరుమల నడకదారిలో చిరుత పులులు వరుసగా దాడులు చేస్తూ చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. కాగా తాజాగా తిరుమలలో చిరుత దాడిలో 6 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలిపిరి మెట్ల మార్గంలో శుక్రవారం రాత్రి బాలిక తప్పిపోయింది. ఆ తర్వాత ఆ చిన్నారిపై ఎలుగుబంటి
Cheetah Attack : తిరుమల నడకదారిలో చిరుత పులులు వరుసగా దాడులు చేస్తూ చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. కాగా తాజాగా తిరుమలలో చిరుత దాడిలో 6 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలిపిరి మెట్ల మార్గంలో శుక్రవారం రాత్రి బాలిక తప్పిపోయింది. ఆ తర్వాత ఆ చిన్నారిపై ఎలుగుబంటి దాటిచేసి చంపి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అయినా.. చివరకు నిన్న రాత్రి తప్పిపోయిన లక్షిత ఉదయం నడకదారిలోని నరసింహస్వామి ఆలయం వద్ద శవమై తేలింది.. చిన్నారి మెడపై దాడి చేసి ముఖ భాగాన్ని పూర్తిగా తినేసి ఉండడంతో.. చిన్నారి లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు. చిరుత దాడిలో బాలిక మృతిచెందినట్టు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.
దారిలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. గతంలో బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అంతకు ముందు ఈ ఘటనపై స్పందించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. లక్షిత మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు.. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్, ఈవోతో ఫోన్‌లో మాట్లాడాను.. వారు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకునే విషయాన్ని కూడా ఆలోచిస్తామని తెలిపారన్న ఆయన.. అయితే, ఈ ఘటనలో లక్షిత తల్లిదండ్రులపై నాకు అనుమానం ఉందన్నారు. వారిని కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.