Published On:

Uric Acid Solution: ఒక్క ఆకుతో అద్భుత ప్రయోజనాలు..! శరీరంలోని యూరిక్ యాసిడ్ ను తరమండి ఇలా..!

Uric Acid Solution: ఒక్క ఆకుతో అద్భుత ప్రయోజనాలు..! శరీరంలోని యూరిక్ యాసిడ్ ను తరమండి ఇలా..!

Uric Acid Solution In Telugu: యూరిక్ యాసిడ్… ఈ పేరు వింటుంటే మామూలుగానే ఉన్నా…  అది మన శరీరంలో ఎక్కువైతే మాత్రం చాలా డేంజర్. ఏకంగా ఎముకల జాయింట్ల దగ్గర పేరుకుపోయి గుజ్జును తినేసి ఎముకల జాయిట్లను అరగదీస్తుంది. ప్రస్తుతం వయసు పైబడిన వారు మోకాళ్లనొప్పులతో బాధపడటానికి ముఖ్యకారణం ఇదే.

మటన్, చికెట్, పప్పులు ఎక్కువగా తినడం వలన యూరిక్ యాసిడ్  శరీరంలో పెరుగుతుంది. అయితే దీన్ని శరీరంనుంచి ఎంత తొందరగా బయటకు పంపిస్తే అంత మంచింది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం వల్ల, అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి. కీళ్ల నొప్పులు, వాపు, ఆర్థరైటిస్ మొదలైనవి.

 

 

ఒక ఆకుతో యూరిక్ యాసిడ్‌ను శరీరం నుంచి బయటకు తరమవచ్చు…
యూరిక్ యాసిడ్ పెరిగిన తర్వాత, వైద్యుడి సలహాతో మందులు సకాలంలో తీసుకోవాలి. కానీ ఆయుర్వేదం కూడా ఇందులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, పెరిగిన యూరిక్ యాసిడ్‌ను తమలపాకు సహాయంతో తగ్గించవచ్చు. తమలపాకు పేరు అందరూ వినే ఉంటారు. మన నానమ్మలు, అమ్మలు వేసుకునే తాంబూలం అన్నమాట. అయితే మామూలు ఆకే ఇందులో ప్రధానమైనది.

 

 

యూరిక్ యాసిడ్‌లో తమలపాకు యొక్క ప్రయోజనాలు…
ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్‌ను తమలపాకుతో తగ్గించవచ్చు. ఇందుకు తమలపాకులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిని ఉపయోగించడం ద్వారా, అనేక రకాల వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు.

 

 

తమలపాకులను ఇలా తినండి …
యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడానికి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక తమలపాకును నమలండి. దీనితో పాటు, ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగండి. ఇది పెరిగిన యూరిక్ యాసిడ్‌ను త్వరగా తగ్గిస్తుంది.

తమలపాకుతో అల్లం
తమలపాకులలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు ఉంటాయి. దీనిని అల్లంతో కలిపి తీసుకుంటే, యూరిక్ యాసిడ్ త్వరగా తగ్గుతుంది. దీని కోసం, 2 నుండి 3 తమలపాకులను కొన్ని అల్లం ముక్కలతో కలిపి రుబ్బుకుని కషాయం తయారు చేసుకోండి. ఈ కషాయాన్ని రోజుకు ఒకసారి త్రాగండి. ఇది యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

తమలపాకు రసం
దీని కోసం, 3 నుండి 4 తమలపాకులను తీసుకొని బాగా కడిగి రుబ్బుకోండి. తర్వాత దాని రసాన్ని తీసి ఈ రసంలో ఒక టీస్పూన్ తేనె కలపండి. దీనిని తీసుకోవడం ద్వారా, యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు.

గమనిక.. పైన తెలిపిన విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని వాడే ముందు డాక్టర్లను సంప్రదించగలరు. ఖచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.

ఇవి కూడా చదవండి: