Last Updated:

Surya Grahan 2022: సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఈ పనులు తప్పకుండా చేయాలి!

ఈ ఏడాదిలో ఏర్పడిన సూర్య గ్రహాణాలకంటే ఈ రోజు ఏర్పడబోయే గ్రహణం చాలా శక్తి వంతమైనది.అలాగే ఈ ఏడాదిలో చివరి గ్రహం కాబట్టి ఈ గ్రహాణానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ గ్రహణం అన్ని దేశాల్లో కాకుండా మన దేశంలో అక్టోబర్ 25 సాయంత్రం 4:22 గంటలకు ప్రారంభం కాబోతోంది.

Surya Grahan 2022: సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఈ పనులు తప్పకుండా చేయాలి!

Surya Grahan: ఈ రోజు ఏర్పడే సూర్యగ్రహణం ఒక అశుభకరమైన సంఘటనగా జోతిష్య శాస్త్రం ఎప్పుడో పరిగణించింది. ఈ రోజు అనగా మంగళవారం రోజున పూజలు, శుభకార్యాలు చేయరాదు. సూర్యగ్రహణం సమయంలో సూర్యభగవానుడితో పాటు ఇతర దేవుళ్లను స్మరించుకోవాలని జోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఏర్పడిన సూర్య గ్రహాణాలకంటే ఈ రోజు ఏర్పడబోయే గ్రహణం చాలా శక్తి వంతమైనది. అలాగే ఈ ఏడాదిలో చివరి గ్రహం కాబట్టి ఈ గ్రహాణానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ గ్రహణం అన్ని దేశాల్లో కాకుండా మన దేశంలో అక్టోబర్ 25 సాయంత్రం 4:22 గంటలకు ప్రారంభం కాబోతోంది.

సూర్యగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి వస్తుందని చాలా మంది భయపడుతుంటారు. ఈ శక్తి నుంచి విముక్తి పొందడానికి పలు రకాల పనులను కూడా చేయాల్సి ఉంటుంది. ఐతే సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఎలాంటి పనులు చేయాలో మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం.

సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఈ పనులు తప్పకుండా చేయాలి..
1.సూర్యగ్రహణం ముగిసిన వెంటనే తులసి మొక్క పై గంగాజలం చల్లి శుద్ధి చేయాల్సి ఉంటుంది.
2.ఇంట్లో మీరు పూజించే విగ్రహాల పై కూడా గంగాజలం చల్లి ఆ గదినంతా శుభ్రం చేసుకోవాలిసి ఉంటుంది.
3.అంతేకాకుండా ఇంట్లోని పూజా స్థలంలో లేదా పూజించే స్థలంలో పసుపు నీళ్ళతో చల్లుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి తొలగిపోతుందని మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
4.ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రహణం కారణంగా వచ్చే ప్రతికూల శక్తి పుట్టబోయే బిడ్డ పై పడుతుందని శాస్త్రం వెల్లడించింది. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణం వీడిన వెంటనే తల స్నానం చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి: