Home / తాజా వార్తలు
హైదరాబాద్ లోటస్ పాండ్‌లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. లోటస్ పాండ్‌లో రోడ్డును ఆక్రమించి వైఎస్ ఫ్యామిలీ నిర్మాణాలు చేపట్టింది.
తాజాగా ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది .ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం ఫోటో తో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశించింది .
చత్తీస్‌గఢ్‌లో మారోమారు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం నాడు నారాయణపూర్ జిల్లాలో అభుజమార్హా లో భద్రతాదళాలకు.. నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఏపీ మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గమైన మంగళ గిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు .మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు
విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బీసీ హాస్టల్ లో నిద్రించారు.ఎంపీగా ఎన్నికైన కొద్దీ రోజులలోనే ఇలా ఓకే బిసీ హాస్టల్ లో నిద్రించడం ఆసక్తిగా మారింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మెట్టవలసలోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్‌ను గురువారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికైన తెలుగు ఐఏఎస్ అధికారి ఎమ్.వి.ఆర్.కృష్ణ తేజకు ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగించకుండా... కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులు పరిశీలిస్తున్నామని కాలేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ ఘోష్ అన్నారు. హైదరాబాద్ లో విలేకరులతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి కురిసిన కుండపోత వర్షానికి సీతారామ చంద్రస్వామివారి ఆలయ పరిసరాలన్నీ నీట మునిగాయి
రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన మీర్ పేట్ కార్పొరేటర్ నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 90 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.