Mana Hakku Hyderabad: మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా ‘మన హక్కు హైదరాబాద్’ కర్టెన్ రైజర్, సాంగ్ రిలీజ్
Mana Hakku Hyderabad Song Release: ప్రజల, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతున్న హక్కు ఇనిషేటివ్ సంస్థ మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని శుక్రవారం ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించింది. ఈరోజు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్ అనే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హక్కు ఇనిషేటివ్ ఫౌండర్ డైరెక్టర్ డా.కోట నీలిమ, సీనియర్ అడ్వొకేట్, సోషల్ యాక్టివిస్ట్ లుబ్నా షరవత్, సోషల్ యాక్టివిస్ట్ పంకజ్ బాసిన్, మాంట్ పోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ ఫౌండేషన్ బ్రదర్ వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు పర్యావరణవేత్తలు పాల్గొని విలువైన సూచనలు చేశారు.
హక్కు ఇనిషేటివ్ ఫౌండర్ డైరెక్టర్ డా.కోట నీలిమ మాట్లాడుతూ – హైదరాబాద్ ను సుందర నగరంగా తీర్చిదిద్దే క్రమంలో హక్కు ఇనిషేటివ్ నుంచి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ప్రభుత్వం వైన్ షాప్స్ కు విపరీతంగా అనుమతులు ఇచ్చినప్పుడు ఇళ్ల మధ్య వైన్ షాప్స్ తొలగించేలా ప్రజల భాగస్వామ్యంతో ప్రయత్నం చేశాం. అలాగే నగరంలో వరదలు వచ్చినప్పుడు మా సంస్థ బాగా పనిచేసింది. మేము నగరంపై మాకున్న విజ్ఞానంతోనే కాదు స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. మాకు వివిధ రకాల టీమ్స్ ఉన్నాయి. మూసి నదిని ప్రక్షాళన చేయాలని చెరువులను సంరక్షించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేధావుల నుంచి , పౌర సమాజం నుంచి మద్దతు లభిస్తోంది.
ప్రజా భాగస్వామ్యంతోనే నిర్ణయాలు తీసుకోవాలన్నది, విధానాలు రూపొందించాలన్నది తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వ విధానం. అయితే సంబంధిత భాగస్వాములందరి నుంచి, ముఖ్యంగా స్థానికంగా నివసించే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని, వాటి ఆధారంగా ప్రభుత్వం విధానాలు రూపొందించాలని, నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఈరోజు జరిగిన చర్చా కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు పర్యావరణవేత్తలు పాల్గొని విలువైన సూచనలు చేశారు. ఈ సూచనల ఆధారంగా హక్కు ఇనిషియేటివ్ మూసి ప్రక్షాళన, చెరువుల సంరక్షణపై తీర్మానాలను రూపొందించింది. త్వరలోనే ఈ తీర్మానాలను ప్రభుత్వానికి అందజేయబోతున్నామన్నారు.
సోషల్ యాక్టివిస్ట్ పంకజ్ బాసిన్ మాట్లాడుతూ.. ఈ రోజు వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్ అంశం మీద చర్చా కార్యక్రమం నిర్వహించాం. నీలిమ గారి సారథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలు సూచనలు తీసుకున్నాం. మన నగరాన్ని అందంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ మంచి సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాల ద్వారా సమస్యలకు నగర సమస్యలకు చక్కటి పరిష్కారాలను హక్కు ఇనిషియేటివ్ సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
మాంట్ పోర్ట్ సోషల్ ఇనిస్టిట్యూట్ ఫౌండేషన్ బ్రదర్ వర్గీస్ మాట్లాడుతూ… మూసీ నది ప్రక్షాళన చాలా విస్తృతమైన అంశం. మూసీలోకి మురుగునీరు చేరకుండా చర్యలు చేపట్టాలి. మూసీ చుట్టుపక్కల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తే ఇది సాధ్యమే. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇందుకోసం ముందడుగు వేయాలి. వెనిస్ నగరంతో పాటు మన దేశంలో కొన్ని నదులకు పునర్జీవం కల్పించారు. అందువల్ల టూరిజం కూడా పెరిగింది. మన మూసీ విషయంలోనూ అలాంటి మంచి ఫలితాలు రాబట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డాక్టర్ పద్మజ షా, కొడాలి శ్రీనివాస్, మోటూరి వెంకట దుర్గాప్రసాద్, అశోక్ భాషిన్, పంకజ్ అగర్వాల్, డాక్టర్ నరసింహారెడ్డి, డాక్టర్ లుబ్నా సార్వత్, డాక్టర్ అనంత్ మరిగంటి, రుబీనా నఫీస్, సుజాత సూరేపల్లి, డాక్టర్ ప్రభు కుమార్,సయ్యద్ బిలాల్ , హక్కు ఇనిషియేటివ్ డైరెక్టర్లు రాహుల్ హేమ్నాని, అనూజ్ పార్థీ, సీనియర్ జర్నలిస్ట్ రావికంటి శ్రీనివాస్, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ కు చెందిన నందనం కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.