Today Horoscope February 04: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది!
Horoscope Today in Telugu February 04: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.
మేషం – రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది.
వృషభం – నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.
మిథునం– అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార సంబంధిత కార్యక్రమాలలో ఆటంకాలు ఎదు రైనా సానుకూల పడతాయి. మంచి మాటకారిగా వ్యవహరిస్తారు.లిటిగేషన్ వ్యవహారాలు సానుకూల పడును
కర్కాటకం – ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు. సాధ్యమైనంత వరకు వత్తిడికి లోను కాకుండా ఉండటానికి యోగా వంటివి అభ్యసిస్తారు. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి.
సింహం – ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
కన్య – ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు.
తుల – ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో మెలగడం చెప్పదగినది. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు.
వృశ్చికం – చికాకు అసహనం అధికంగా ఉంటాయి. వృత్తి- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. అనుకొని అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.
ధనుస్సు – ఆర్థికపరమైన లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వస్తుంది. ఆలోచనలు అధికమవడం ఒత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది.
మకరం – క్రయవిక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలరు. కుటుంబ విషయంలో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి.
కుంభం – నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం అవగలుగుతారు. దూరప్రాంత ప్రయాణాలు తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
మీనం – వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త రుణాలు చేస్తారు.