Published On:

Huge demand for beer in telangana: కూల్ గా తాగుతున్నరు.. తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు

Huge demand for beer in telangana: కూల్ గా తాగుతున్నరు.. తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు

Beer sales: తెలంగాణలో బీర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పండుగలైనా, పెళ్లిళైనా, ఫంక్షన్ లు అయినా, ఏ చిన్న పార్టీ జరిగినా.. మందుబాబులు బీర్లతో జల్సా చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పెద్ద సంఖ్యలో బీర్ల కేసులు ఖాళీ చేస్తున్నారు. దీంతో బీర్ సీసాలకు కొరత ఏర్పడింది.

అయితే రాష్ట్రంలో బీర్లకు ఎలాంటి కొరత లేకుండా డిమాండ్ తగినట్టు ఉత్పత్తి జరగాలని ప్రభుత్వం బీవరేజెస్ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలసిందే. ఏప్రిల్, మే నెలల్లో ఎండలకు బీర్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఎక్సైజ్ శాఖకు కూడా ఆదాయం పరంగా ఈ రెండు నెలలే కీలకమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రజల డిమాండ్ కు అనుగుణంగా బీర్ల ఉత్పత్తి జరుగుతున్నా.. అమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. వైన్స్, బార్ షాపుల్లో స్టాక్ వచ్చిన కొద్దిసేపట్లోనే అమ్మకాలు జరిగిపోతున్నాయి.

దీంతో బీర్ల అమ్మకాల ద్వారా వాటి వినియోగం పెరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. ఎండాకాలం, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే అమ్మకాలు జరగుతున్నాయని వివరించారు. ఓ వైపు ప్రభుత్వం పలు మద్యం బ్రాండ్లపై రేట్లు పెంచుతున్నా.. అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. మందుబాబులు పోటీపడి మరి బీర్లు కొనుగోలు చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు దాదాపు 3 లక్షలకు పైగా బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే.. ప్రస్తుత సీజన్లో అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయని వ్యాపారులు చెప్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 5.48 కోట్ల కేసుల బీర్ల అమ్మకాలు జరగ్గా.. ఈ సంవత్సరం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పెరుగుతున్న డిమాండ్ కారణంగా బీర్ల అమ్మకాల ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరేలా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: