Last Updated:

Actress Ileana : మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ ని చూపించిన ఇలియానా.. సీక్రెట్ రివీల్ !

ప్రముఖ హీరోయిన్ ఇలియానా ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను తల్లిని అయినట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఊహించని ఈ ప్రకటనతో ఆమె అభిమనులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం.. మరి ముఖ్యంగా అందుకు కారణం ఎవరో అని

Actress Ileana : మొత్తానికి తన బాయ్ ఫ్రెండ్ ని చూపించిన ఇలియానా.. సీక్రెట్ రివీల్ !

Actress Ileana : ప్రముఖ హీరోయిన్ ఇలియానా ఇటీవల కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే తాను తల్లిని అయినట్లు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఊహించని ఈ ప్రకటనతో ఆమె అభిమనులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం.. మరి ముఖ్యంగా అందుకు కారణం ఎవరో అని చెప్పకపోవడంతో ఇలియానాపై తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇలియానా అవేమి పట్టించుకోకుండా తన ప్రెగ్నెన్సీ టైంని ఎంజాయ్ చేస్తుంది. అభిమానులు, నెటిజన్లు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

అయితే రీసెంట్ ఒకరితో క్లోజ్ గా దిగిన ఫోటోని షేర్ చేసింది ఇలియానా. కానీ ఆ ఫోటో బ్లర్ గా ఉండటంతో అందులో ఉన్నది ఎవరో తెలియలేదు. తాజాగా ఒక అబ్బాయితో దిగిన సెల్ఫీ ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఓ మూడు ఫోటోలని షేర్ చేస్తూ డేట్ నైట్ అని రాసి లవ్ సింబల్ వేసింది. దీంతో ఇలియానా బాయ్ ఫ్రెండ్ అతనే, తన ప్రెగ్నెన్సీకి కారణం అతనే అని కామెంట్స్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు. ఇలియానా షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. కానీ ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో అని మాత్రం చెప్పకపోవడం గమనార్హం.

మరోవైపు గతంలో ఇలియానా కత్రినా కైఫ్ తమ్ముడితో డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలియానా పోస్ట్ చేసిన ఫోటో మాత్రం అతను కాకపోవడంతో ఈ కొత్త వ్యక్తి ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చూడాలి మరి ఇలియానా ఎప్పుడు ఏం చెబుతుందో అని.. కాగా కొద్ది నెలల క్రితమే ఓ మ్యూజిక్ వీడియో ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఇలియానా. పాపులర్ ర్యాపర్ బాద్‌షా మ్యూజిక్ వీడియోలో ఇలియానా తళుక్కుమంది. ‘సబ్ గజాబ్’ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోలో ఇలియానా చాలా చబ్బీ గా కనిపించింది. అంతేకాకుండా తన ట్రేడ్ మార్క్ బెల్లీ డ్యాన్స్‌తో దుమ్మురేపింది.

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గోవా బ్యూటీ ” ఇలియానా “. మొదటి సినిమా తోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోలందరి సరసన నటించి ఓ రెంజ్‍లో దూసుపోయింది ఈ అమ్మడు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ పలు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఉన్నట్టుండి ఇలియానా బొద్దుగా మారడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. దీంతో మళ్లీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటుంది.