Home / Sri Lanka
శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.
ఆదివారం ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు బారత్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే జాతీయ క్రికెట్ బోర్డును రద్దు చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మక ద్రోహం మరియు అవినీతితో కలుషితమయిపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డు సభ్యలు రాజీనామా చేయాలని ఆదేశించారు.
కష్టాల్లో ఉన్న తన పర్యాటక రంగాన్ని పెంపొందించడానికి శ్రీలంక తన పొరుగు దేశం భారతదేశం వైపు చూస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో, రామాయణ సర్క్యూట్ భారతదేశం నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షించగలదని శ్రీలంక వాసులు గ్రహించారు మరియు వారు దానిని చురుకుగా ప్రచారం చేస్తున్నారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్ ) శ్రీలంక యొక్క దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో సహాయపడటానికి నాలుగు సంవత్సరాలలో దేశం కోసం దాదాపు $3 బిలియన్ల బెయిలౌట్ కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపిందని ఐఎంఎఫ్ సోమవారం ప్రకటించింది.
శ్రీలంక విద్యుత్ బోర్డు విద్యుత్ చార్జీలను ఏకంగా 275 శాతం వరకు పెంచింది. దేశ ఆర్దిక వ్యవస్ద దివాలా తీయడంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర్ అన్నారు
శ్రీలంక క్రికెట్ జట్టులో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకేరోజు ముగ్గురు క్రికెటర్లు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక వంటి స్టార్ ప్లేయర్స్ ఒకే రోజు పెళ్లి చేసుకున్నారు.
ప్రపంచకప్ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీసుల్లో లీనమయ్యాయి. కాగా తాజాగా టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన గ్రూప్-ఏ క్వాలిఫయర్ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాటర్ జునైద్ సిద్ధిఖి భారీ సిక్సర్ బాదాడు. ఏకంగా 109 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు.
శ్రీలంక నవలా రచయిత షెహన్ కరుణతిలక తన ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మెయిడా పుస్తకానికి బుకర్ బహుమతిని గెలుచుకున్నారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారకుడయ్యారనే ఆరోపణలతో ప్రజల ఆగ్రహానికి గురై విదేశాలకు పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శుక్రవారం సొంత గడ్డ పై కాలు మోపారు. దాదాపు 50 రోజుల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. గొటబాయకు బంగళా, 24 గంటలపాటు భద్రత కల్పించేందుకు లంక ప్రభుత్వం
స్వయం ప్రకటిత దైవం స్వామి నిత్యానంద ఆరోగ్య సమస్యల కారణంగా శ్రీలంకలో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు శ్రీలంక ప్రభుత్వానికి లేఖరాసారు. తాను స్దాపించిన కైలాస దేశంలో వైద్యసదుపాయాలు లేవని తనకు తీవ్ర అనారోగ్యంగా ఉన్నందున శ్రీలంకలో వైద్యచికిత్సకు అనుమతించాలంటూ లేఖలో పేర్కొన్నారు.