Last Updated:

Pakistan’s Beggars: సౌదీ అరేబియా,ఇరాక్ లకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్ బిచ్చగాళ్లు

పాకిస్థాన్ భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అదేవిధంగా పాక్ చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంది. ఇపుడు తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలో బిచ్చగాళ్లు చేరారు. అవును.. సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాలు ఇప్పుడు బిచ్చగాళ్ల ప్రవాహాన్ని అరికట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

Pakistan’s Beggars: సౌదీ  అరేబియా,ఇరాక్ లకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్ బిచ్చగాళ్లు

Pakistan’s Beggars: పాకిస్థాన్ భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అదేవిధంగా పాక్ చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంది. ఇపుడు తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలో బిచ్చగాళ్లు చేరారు. అవును.. సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాలు ఇప్పుడు బిచ్చగాళ్ల ప్రవాహాన్ని అరికట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ఇది వెలుగులోకి వచ్చింది.

ఉమ్రా వీసాలపై బిచ్చగాళ్లు..(Pakistan’s Beggars)

పాకిస్తాన్ ఆర్దిక సంక్షోభంలో చిక్కుకుంది. రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం మరియు ఆకాశాన్నంటుతున్న ఆహారం మరియు ఇంధన ధరలతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటికితోడు విద్యుత్ చార్జీలు కూడా బాగా పెరిగిపోయాయి. రంజాన్ నెలలో ఉచితంగా గోధుమపిండి పంపిణీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.దీనితో పాకిస్తాన్ నుండి బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో పశ్చిమాసియా దేశాలకు తరలివస్తున్నారు. విదేశీ పాకిస్థానీల స్టాండింగ్ కమిటీ ఇటీవల ఈ విషయాన్ని లేవనెత్తింది.పశ్చిమాసియా దేశాల్లో నిర్బంధించబడిన మొత్తం బిచ్చగాళ్లలో తొంభై శాతం మంది పాకిస్థాన్‌కు చెందిన వారేనని, ఈ బిచ్చగాళ్లు ఇరాక్ మరియు సౌదీ అరేబియాలోని జైళ్లలో బంధించబడ్డారని ఓవర్సీస్ పాకిస్థానీల కార్యదర్శి జీషన్ ఖంజదా చెప్పారు.ఉమ్రా వీసాలపై తీర్థయాత్ర ముసుగులో పాకిస్థానీ బిచ్చగాళ్లు విదేశాలకు వెళ్లి, ఆ తర్వాత వీధుల్లో భిక్షాటనకు పాల్పడుతున్నారని ఇరాక్, సౌదీ అరేబియా రాయబారులు తెలియజేసినట్లు చెప్పారు.

పాకిస్తాన్ బిచ్చగాళ్లతో నిండిపోయిన జైళ్లు..

మక్కా గ్రాండ్ మసీదు లోపల అరెస్టయిన జేబుదొంగల్లో ఎక్కువ మంది పాకిస్థానీ జాతీయులే అని కూడా అతను చెప్పాడు.10 మిలియన్ల మంది పాకిస్తానీ పౌరులు విదేశాల్లో నివసిస్తున్నారని, వీరిలో గణనీయమైన సంఖ్యలో భిక్షాటనలో పాల్గొంటున్నారని తెలియజేశారు.ఈ వ్యక్తులు వీసాలు పొంది, ఇతర దేశాలలో భిక్షాటనను ఆశ్రయిస్తారు, పాకిస్తాన్ నుండి మధ్యప్రాచ్యానికి వెళ్లే విమానాలు తరచుగా వీరితో పూర్తిగా నిండిపోతాయని ఆయన అన్నారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో 1,600,000 మంది పాకిస్థానీలు మరియు ఖతార్‌లో 200,000 మంది పాకిస్థానీలు ఉన్నట్లు కమిటీకి సమాచారం అందింది.
అంతేకాకుండా, ఇరాక్ మరియు సౌదీ అరేబియా దౌత్యవేత్తలు తమ జైళ్లు పాకిస్తాన్ బిచ్చగాళ్లతో నిండిపోయాయని పేర్కొన్నారని, ఈ విషయం ప్రపంచ వేదికపై పాకిస్తాన్‌కు అవమానం కలిగిస్తోందని ఆయన అన్నారు.ఆర్థిక వ్యవస్థతో ఇప్పటికే సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు మధ్యప్రాచ్య దేశాల వీధుల్లో బిచ్చగాళ్లతో కొత్త సమస్య వచ్చింది.

ఇవి కూడా చదవండి: