Earthquake: సునామీ హెచ్చరిక..మరోసారి భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత

Massive Earthquake of 6.9 magnitude strikes Papua New Guinea: ప్రపంచాన్ని భూకంపం మరోసారి వణికించింది. పపువా న్యూ గినియాలో భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. పశ్చిమ నయూ బ్రిటన్ ప్రావిన్స్‌లోని కింబే నగరానికి సుమారు 200 కి.మీల దూరంలో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
అయితే, దాదాపు 10 కి.మీ దూరంలో భూకపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అమెరికా అలర్ట్ చేసింది. సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఇటీవల మయన్మార్, థాయ్ లాండ్ దేశాల్లో భారీ భూకంపం చోటుచేసుంది.
ఈ రెండు దేశాల్లో భూకంప తీవ్రతకు వేలమంది మృతి చెందారు. ఈ భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా మయన్మార్‌లో 3వేల మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఇప్పటికీ పలు దేశాల నుంచి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.