Last Updated:

Kenya Floods: కెన్యాలో భారీ వర్షాలు.. 38 మంది మృతి

కెన్యాలో భారీ వర్షాలకారణంగా ఇప్పటివరకూ 38 మంది మరణించారని కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ ( కెఆర్ సి ఎస్ ) ఒక ప్రకటనలో తెలిపింది. కెన్యా రాజధాని నైరోబీ, మాథారే మురికివాడల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో ఒకరు మరణించగా మరో ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు.

Kenya  Floods: కెన్యాలో భారీ వర్షాలు.. 38 మంది మృతి

Kenya Floods:కెన్యాలో భారీ వర్షాలకారణంగా ఇప్పటివరకూ 38 మంది మరణించారని కెన్యా రెడ్‌క్రాస్ సొసైటీ ( కెఆర్ సి ఎస్ ) ఒక ప్రకటనలో తెలిపింది. కెన్యా రాజధాని నైరోబీ, మాథారే మురికివాడల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో ఒకరు మరణించగా మరో ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు.

లక్షమందికి పైగా నిరాశ్రయులు..(Kenya Floods)

కుండపోతగా పడుతున్న వర్షాలతో నైరోబీలోని పలు ప్రాంతాల్లో నివాసిత ప్రాంతాలను వరదనీరు ముంచెత్తించింది. ప్రధాన రహదరారులపై చెట్లు కూలడంతో రవాణా స్తంభించింది. కిటెంగెలాలోని అథి నదికి వరదలు రావడంతో వేలాది మంది వ్యాపారవేత్తలు, కార్యాలయ ఉద్యోగులు చిక్కుకుపోయారు. భారీ వర్షాలు దేశవ్యాప్తంగా కనీసం 23 కౌంటీలను ప్రభావితం చేశాయి మరియు 110,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.27,716 ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని, సుమారుగా 5,000 పశువులు చనిపోయాయని కెన్యా రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.

 

 

Deadly floods kill 38 in Kenya; situation moving from emergency to disaster  level