Mexico Bus Accident: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41మంది అగ్నికి ఆహుతి
![Mexico Bus Accident: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41మంది అగ్నికి ఆహుతి](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/Accident-Involving-Bus-In-Southern-Mexico-Killed-41-passengers.jpg)
Accident Involving Bus In Southern Mexico Killed 41 passengers: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బస్సుకు అకస్మాత్తుగా నిప్పు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే ప్రమాదం జరిగిన కాసేపటికే బస్సుకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
టబాస్కో రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు విస్తరించడంతో మిగతా వారు తప్పించుకునేందుకు అవకాశం లేక పోవడంతో అగ్నికి ఆహుతులయ్యారు. అనంతరం బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా తగలబడింది. ఈ ప్రమాదంలో ప్రస్తుతం 18 పుర్రెలు సేకరించామని, మిగతా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.